World Bank Invests in Visakhapatnam: విశాఖ నగరం( Visakhapatnam City) పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ఇక్కడ ఐటీ సంస్థల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. ఈ తరుణంలో మౌలిక వసతుల కల్పన పై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. అత్యాధునిక తరహాలో సాగరనగరంలో మౌలిక వసతుల కల్పన జరగనుంది. మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో విశాఖ నగరంలో మురుగు అనేది కనిపించకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఐటీ పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే చాలా సంస్థలను ఆకర్షించింది. అయితే మరిన్ని పెట్టుబడులు రావాలంటే నగరం సుందరంగా కనిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆసియాలోనే అతిపెద్ద మురుగునీటి వ్యవస్థను అందుబాటులోకి తేవాలని చూస్తోంది. ఇందుకుగాను రూ.553 కోట్లు ఖర్చు చేయనుంది.
-ప్రపంచ బ్యాంకు నిధులు కీలకం..
ఇప్పుడు దేనికైనా ప్రపంచ బ్యాంకు( World Bank) నిధులు చాలా కీలకం. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణానికి సైతం ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ప్రపంచ బ్యాంకులో భాగమైన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఐఎఫ్సి విశాఖలో ఆధునిక మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఐఎఫ్సితో ఒప్పందం చేసుకుంది విశాఖ నగరపాలక సంస్థ. దీంతో దేశంలోని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మొదటి కార్పొరేషన్ గా విశాఖ నగరపాలక సంస్థ గుర్తింపు దక్కించుకుంది.
– విశాఖ నగరంలో 100 డివిజన్లు ఉన్నాయి. కొన్ని వందల టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఆపై మురుగునీరు అసౌకర్యంగా ఉంది. అదే నీటిని శుద్ధి చేసి వ్యర్ధాలను బయటకు విడిచిపెట్టనున్నారు. నగరంలోని శివారు ప్రాంతంగా ఉన్న మధురవాడలో మురుగునీరు శుద్ధి చేసే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఐఎఫ్సి నుంచి తీసుకున్న రుణాన్ని ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీతో నగరపాలక సంస్థ తిరిగి వాయిదాల పద్ధతిలో చెల్లించనుంది. 15 ఏళ్ల కాలవ్యవధిలో మూడేళ్లు మారటోరియం గా ఉంటుంది. మిగిలిన 12 ఏళ్లలో నగర పాలక సంస్థ ఐ ఎఫ్ సి కి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. క్రాస్ ఓటింగ్ జరిగితే వైసీపీయే టార్గెట్!
– రాబోయే 30 సంవత్సరాలలో విశాఖ నగరంలో జనాభా వృత్తిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. భూగర్భ మురుగునీటి నెట్వర్క్ ప్రాధాన్యత అంశంగా తీసుకుని… హైయెస్ట్ టెక్నాలజీతో పంపింగ్, లిఫ్టింగ్ స్టేషనులు అందుబాటులోకి రానున్నాయి. ఇలా శుద్ధి చేసిన నీటిని నగరంలో గ్రీనరీ కోసం వినియోగిస్తారు.
– అయితే ఏపీ ప్రభుత్వం విశాఖ నగరం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పర్యాటకంగా అనేక నిర్మాణాలు చేపట్టింది. మొన్ననే నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు చంద్రబాబు. కైలాసగిరిలో దేశంలోనే అతి పెద్ద గాజు వంతెన ఏర్పాటు చేస్తున్నారు.
– ఐటీ దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున విశాఖకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిని మరింత ఆకర్షించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.