Dharmana Prasada Rao: ధర్మాన ప్రసాదరావు పార్టీ మారుతారా? లేకుంటే నాలుగేళ్లపాటు సైలెంట్ గా ఉండిపోతారా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. రాజకీయాలకు దూరమవుతానని చెబుతూ వైసిపికి గుడ్ బై చెప్పారు మాజీ మంత్రి ఆళ్ల నాని. కానీ అనూహ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీ గూటికి చేరేందుకు సిద్ధపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ముందుగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తరువాత ఏకంగా పార్టీకి రిజైన్ చేశారు. ఇప్పుడు అదే ఫార్ములా ధర్మాన ప్రసాదరావు కూడా అనుసరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు. సర్పంచ్ స్థాయి నేత చేతిలో ఓడిపోవడంతో జీర్ణించుకోలేకపోయారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో తన బలమే తప్ప పార్టీకి బలం లేదని భావించారు. అందుకే వైసిపి లో ఉండడం ఏమంత శ్రేయస్కరం కాదని కూడా భావిస్తున్నారు. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రధానంగా తన కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. దానికి భరోసా ఇచ్చే పార్టీలో చేరాలని చూస్తున్నారు. కానీ కూటమి నుంచి సానుకూలత రావడం లేదు. ఒకవేళ తనకు రాజ్యసభ తో పాటు కుమారుడి భవిష్యత్తుకు హామీ ఇస్తే ఆ పార్టీలో చేరాలని చూస్తున్నారు.
* జగన్ కీలక ప్రతిపాదన
తాజాగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల విషయంలో అధినేత జగన్ నుంచి కీలక ప్రతిపాదన వెళ్ళింది. పార్టీలో యాక్టివ్ అవ్వండి.. లేకుంటే మరొకరికి ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చే బాధ్యత మీదేనంటూ జగన్ చెప్పారు. కానీ ధర్మాన మాత్రం జాప్యం చేస్తున్నారు. ఆయన ముందు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల పాటు రాజకీయంగా సైలెంట్ కావడం, లేకుంటే కూటమి పార్టీలో ఏదో ఒక దానిలో చేరడం. అంతేకానీ వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకునే ఉద్దేశం ఆయనలో లేనట్టు తెలుస్తోంది.
* ఆ ఇబ్బందులు తెలుసు
అయితే వైసీపీలో యాక్టివ్ అయితే వచ్చే ఇబ్బందులు ధర్మాన ప్రసాదరావుకు తెలుసు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ రివేంజ్ రాజకీయాలను వ్యతిరేకించారు ధర్మాన. కానీ జగన్ ఆ మాటలను వినలేదు. ఇప్పుడు అదే ధర్మాన పాలిట శాపంగా మారుతున్నాయి. ఒకవేళ వైసీపీలో ధర్మాన యాక్టివ్ అయితే రకరకాల వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖ భూముల వ్యవహారం మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ధర్మాన పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. అయితే మంచి ఆఫర్ వస్తే ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.