Independence Celebrations: సాధారణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు( Independence Day celebration) రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు ఏపీకి ఆ అదృష్టం లేదు. విభజన తరువాత నూతన రాజధానిని నిర్మించుకోవాల్సి వచ్చింది. టిడిపి ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి.. ఎక్కడ ఏర్పాటు చేయకుండా తీవ్ర జాప్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో కదలిక వచ్చింది. తొలి ఏడాది నిధుల సమీకరణ పూర్తి చేసి.. ఈ ఏడాదిలో నిర్మాణ పనులను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఇదే ఊపును కొనసాగించాలంటే రాజధానిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడిచింది. కానీ చివరకు విజయవాడలోనే వేడుకలు జరగడంతో రకరకాల చర్చకు కారణమవుతోంది.
అమరావతిలోని పి 4 సభ..
మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 బహిరంగ సభను రాష్ట్ర సచివాలయం వెనుక ఉన్న భాగంలో నిర్వహించారు. పేదరిక నిర్మూలనలో భాగంగా కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న పి 4 ను అమరావతిలో( Amravati capital ) నిర్వహించగలిగారు. దీంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సైతం అమరావతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సంకేతాలు పంపించింది. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా కొన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఇంతలో భారీ వర్షాలు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. అందుకే తిరిగి విజయవాడ ను వేదికగా మార్చినట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో ఆ రూట్లలో ఉచిత ప్రయాణానికి నో ఛాన్స్!
అదే పనిగా వైసిపి ప్రచారం..
అయితే దీనిపై వైసీపీ( YSR Congress party ) అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అమరావతి వరదలు వస్తే పనికిరాదని.. వర్షం వస్తే చిత్తడిగా మారుతుందని.. అటువంటి చోట చంద్రబాబు రాజధాని నిర్మాణం మొదలుపెట్టారని.. ఈ నిర్మాణాలన్నీ భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. వరద నీటికి సంబంధించి ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా అమరావతిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. వాస్తవానికి ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర వేడుకలు అమరావతి రాజధాని లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాజధానిలో ప్రభుత్వ భవనాలను సుందరంగా తీర్చిదిద్దింది. రాష్ట్ర సచివాలయాన్ని అందంగా అలంకరించింది. కానీ వర్షం కారణంగా అమరావతి ప్రాంతం చిత్తడిగా మారింది. దీంతో అప్పటికప్పుడు విజయవాడకు వేదిక మార్చినట్లు తెలుస్తోంది. కానీ దీనినే సాకుగా చూపి వైసిపి సోషల్ మీడియా రెచ్చిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతిపై అదేపనిగా ప్రచారం చేస్తోంది.