Directors Success with Classy Films: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న దర్శకులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట రాబోతున్న దర్శకులు సైతం పాన్ ఇండియా నేపద్యంలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…క్లాస్, మాస్ అనే తేడా లేకుండా 1000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్న దర్శకులు వాళ్ళ ఐడెంటిటిని మర్చిపోతూ తమ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ‘కింగ్డమ్’ సినిమాతో గౌతమ్ తిన్ననూరి మాస్ సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఆ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో గౌతమ్ తిన్ననూరి తన ఖాతాలో ప్లాప్ ని మూట గట్టుకున్నాడు. మరి గౌతమ్ తో పాటుగా మరి కొంతమంది క్లాస్ సినిమాలు చేసే దర్శకులు సైతం మాస్ సినిమాలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక వివేక్ ఆత్రేయ లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు మాస్ జపం చేస్తున్నాడు.ఇక ఇప్పటికే సరిపోదా శనివారం సినిమాతో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ని చూపించినప్పటికి అది అంత పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. మరి అలాంటప్పుడు మరోసారి మాస్ సినిమాను చేసే కంటే లవ్ స్టోరీలను చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. ఎందుకంటే ఆయనకి అందులో చాలా మంచి ప్రావీణ్యం ఉంది. ఇక వాటిని సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలిగే కెపాసిటి కూడా తనకి ఉంది…
మరి ఇప్పుడు కూడా అలాంటి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించవచ్చు కదా వాళ్లకు టచ్ లేని మాస్ సినిమాలను ఎందుకు చేయాలి అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… నిజానికి దర్శకులు జానర్స్ షిఫ్ట్ చేసుకుంటూ సినిమాలను చేస్తే మంచి అవుట్ ఫుట్ వస్తోంది.
Also Read: ‘ఓజాస్ గంభీరా’ సతీమణి ని పరిచయం చేసిన ‘ఓజీ’ మేకర్స్.. 2వ పాట ఎప్పుడంటే!
కానీ అన్ని జానర్స్ లో మంచి పట్టు ఉండి దానిని సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలిగే కెపాసిటి ఉన్నవాళ్ళకు మాత్రమే అది సాధ్యమవుతోంది…సక్సెస్ ఫుల్ సినిమా చేసిన పర్లేదు కానీ, ఆ సినిమాతో సక్సెస్ రాకపోతే మాత్రం చాలా మంది విమర్శిస్తూ ఉంటారు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
ఒక మూవీతో దర్శకుడు తప్పటడుగు వేసి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటే ప్రొడ్యూసర్స్ సైతం విపరీతంగా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అందువల్లే సినిమా చేయడానికి ముందే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే బరిలోకి దిగాలి. లేకపోతే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది…