Bigg Boss 9 Telugu Bharani: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఓటింగ్ ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఉంటోంది. 13 వ వారం లోకి అడుగుపెట్టాము, ఇప్పటికీ టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది కరెక్ట్ చెప్పలేకపోతున్నాం, అదే విధంగా టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఎవరెవరు నిలుస్తారు అనేది కూడా చెప్పలేకపోతున్నాం. మొదటి మూడు స్థానాల్లో తనూజ, కళ్యాణ్, ఇమ్మానుయేల్ కొనసాగుతున్నారు. వీరిలో టైటిల్ రేస్ కి దగ్గరగా ఉన్నది తనూజ మరియు కళ్యాణ్ మాత్రమే. ఇమ్మానుయేల్ కి మూడవ స్థానం ఫిక్స్. కానీ నాలుగు, ఐదు స్థానాల కోసం పోటీ భారీ గానే ఉంది. సంజన,భరణి మరియు రీతూ చౌదరి లలో ఎవరో ఇద్దరు టాప్ 5 లో స్థానం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. గత వీకెండ్ ఎపిసోడ్ లో సంజన బాగా హైలైట్ అయ్యింది. దీంతో ఆమె ఓటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది, టాప్ 5 లో స్పాట్ ఫిక్స్ చేసుకుందని అంతా అనుకున్నారు.
కానీ ఈ వారం భరణి గ్రాఫ్ అంతకంటే ఎక్కువ పెరిగిపోయింది. నిన్నటి ఎపిసోడ్ మీరంతా చూసే ఉంటారు. ఈ ఎపిసోడ్ లో రీతూ చౌదరి, భరణి కి మధ్య పోటీ జరగ్గా, రీతూ చౌదరి గెలుస్తుంది. కానీ దానికి కొనసాగింపుగా నేడు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ తర్వాత భరణి గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే నిన్న సాయంత్రం లైవ్ చూసిన వాళ్ళు, భరణి కి ఓట్లు గుద్దేస్తున్నారు. నిన్న లైవ్ లో ఆయన బాగా ఏడ్చాడట కూడా. నేడు అదంతా ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేయనున్నారు. కాబట్టి ఈ వారం ఆయన టాప్ 5 లో తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు అనే చెప్పాలి. ఇక పోతే ఈ వారం నామినేషన్స్ లోకి తనూజ, డిమాం కళ్యాణ్, సంజన , భరణి, రీతూ చౌదరి మరియు సుమన్ శెట్టి వచ్చారు.
వీరిలో తనూజ కి అత్యధిక ఓటింగ్ పడుతోంది. నెంబర్ స్థానం లో ఆమె తిరుగులేని ఆధిపత్యం తో కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాతి స్థానం లో డిమోన్ పవన్ కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరి తర్వాత నిన్న మొన్నటి వరకు సంజన కొనసాగేది. కానీ ఇప్పుడు స్థానం లోకి భరణి వచ్చాడు. ఈరోజుటి ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత ఆయన రెండవ స్థానానికి ఎగబాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక నాల్గవ స్థానం లో ప్రస్తుతానికి సంజన కొనసాగుతోంది, ఐదవ స్థానం లో రీతూ చౌదరి కొనసాగుతుండగా, ఆరవ స్థానం లో సుమన్ శెట్టి కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.