రాయ్ లక్ష్మి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటికి తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తమిళ తెలుగు కన్నడ, మలయాళ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించింది.
విభిన్న పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో గణనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది రాయ్ లక్ష్మీ.
మే 5, 1990న కేరళలోని కొచ్చిలో జన్మించిన లక్ష్మీ 15 ఏళ్ల వయసులో కర్క కసదర (2005)తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
మంకథా (2011), అర్జున (2012), సింగిల్ శంకర్ (2014) వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె కెరీర్ కొత్త మలుపులు తిరిగింది.
అభిమానులు రాయ్ లక్ష్మీని రత్తాలు అని ప్రేమగా, ముద్దుగా పిలుస్తుంటారు.
ఖైదీ నెంబర్ 150లో ఐటెం సాంగ్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత రత్తాలు అనే పేరు ముద్దుగా మారింది.
రీసెంట్ గా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ చీరలో కనిపించి మెస్మరైజ్ చేసింది.