Pawan Kalyan Controversy: తెలుగుదేశం పార్టీకి ( Telugu Desam Party)అనుకూల మీడియా ఉంది. ఆ పార్టీకి బలమైన మద్దతు దారుగా ఉంటుంది. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ఆ సెక్షన్ ఆఫ్ మీడియా తెలుగుదేశం పార్టీకి ఎనలేని బలం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మీడియా పెత్తనం ఎక్కువగా ఉంటుంది. సలహాలతో పాటు సూచనలు కూడా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వాధినేతకు అందిస్తుంటాయి. అయితే ఇటీవల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సలహాలు, సూచనలు చంద్రబాబుకు ఎక్కువయ్యాయి. వారాంతపు కామెంట్ కొత్త పలుకు రూపంలో రాస్తుంటారు రాధాకృష్ణ. ఏకకాలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వారాంతపు కథనం ఉంటుంది. అయితే ఈసారి చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనం రాశారు రాధాకృష్ణ. చంద్రబాబు బోళా శంకరుడని.. ఆయనకు లేనిపోని సలహాలు ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇలా అయితే కష్టమని తేల్చి చెబుతున్నారు. అయితే అదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసమేనని ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తోంది.
Also Read: పులివెందుల, ఒంటి మిట్ట రెండు జెడ్పీ టీసీ స్థానాల కోసం ఎందుకింత రచ్చ..? ఎవరు గెలుస్తారు?
పి 4 ను తప్పు పడుతున్న ఆర్కే..
రాష్ట్రంలో నిరుపేదలు లేకుండా చంద్రబాబు( CM Chandrababu) ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రూపొందించారు. పి 4 లో భాగంగా ‘బంగారు కుటుంబాలు- మార్గదర్శకులు’ పథకాన్ని ప్రారంభించారు. నిరుపేద కుటుంబాలను.. ఆర్థికంగా వృద్ధి చెందిన కుటుంబాల వారు అండగా నిలవాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీని విషయంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు టార్గెట్ ఇచ్చారు. జన్మభూమి తో పాటు శ్రమదానం కార్యక్రమాన్ని దీనికి స్ఫూర్తిగా తీసుకున్నారు. అయితే ఈ విషయంలో తప్పు పడుతున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇది ఆచరణ సాధ్యం కాని పథకంగా చెబుతున్నారు. అనవసర సలహాలు సూచనలు పాటించి చంద్రబాబు ఇబ్బందులు తెచ్చి పెట్టుకుంటున్నారని తన వారాంతపు కథనంలో రాసుకొచ్చారు. అయితే ఎప్పుడూ చంద్రబాబు విధానాలను సమర్థించే రాధాకృష్ణ ఒక్కసారిగా వ్యతిరేకించడం హాట్ టాపిక్ అవుతోంది. దీని వెనుక కారణం ఏమై ఉంటుందా? అన్న చర్చ నడుస్తోంది.
Also Read: ఏపీ ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. ఇంతకీ ఏం జరిగింది..
అదే పనిగా సోషల్ మీడియా..
అయితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ( Andhra Jyothi Radha Krishna )వారాంతపు కామెంట్లో లేనిపోని సలహాలు ఇచ్చేది పవన్ కళ్యాణ్ అని అర్థం వచ్చేలా.. వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ తో కూడిన చంద్రబాబు ఫోటోలను, వీడియోలను జత చేసి ఈ ప్రచారానికి దిగింది. గతంలో ప్రజారాజ్యం, తర్వాత జనసేన విషయాల్లో ఆంధ్రజ్యోతి వ్యతిరేక కథనాలు ప్రచురించింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పవన్ జత కట్టిన నాటి నుంచి ప్రాధాన్యమిస్తోంది. అయితే మునుపటి మాదిరిగా టిడిపి కూటమి విషయంలో ఆంధ్రజ్యోతి అదే పనిగా పొగడ్తలు లేవు. మధ్య మధ్యలో వ్యతిరేక కథనాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రాధాకృష్ణ మాట చెల్లుబాటు కావడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రాధాకృష్ణ ఆగ్రహానికి కూడా అవే కారణమని తెలుస్తోంది. అందుకే రాధాకృష్ణ వారాంతపు కామెంట్స్ రాశారో లేదో.. అది పవన్ కళ్యాణ్ కు ఉద్దేశించి అని అర్థం వచ్చేలా ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పటికే జనసేన వర్గాలు ఆంధ్రజ్యోతి విషయంలో భిన్నంగా ఉంటాయి. వారిలో కోపం తెప్పించేందుకే ఈ ప్రయత్నం అని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.