Pulivendula ZPTC By-Election: రాజకీయాల్లో( politics) టర్నింగ్ పాయింట్లు ఉంటాయి. ముఖ్యంగా అనుకోని విజయాలు చాలా రాజకీయ పార్టీలకు కలిసి వస్తాయి. 2019 ఎన్నికల్లో గెలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తరువాత వచ్చిన స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కనీసం తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని అంతా అంచనా వేశారు. కానీ 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి సీన్ మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించింది. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అనూహ్య గెలుపు పొందింది. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అంతులేని విజయ గర్వంతో ఎన్నికల్లో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అందుకే ఈ రాజకీయ పార్టీ కైనా చిన్నపాటి టర్నింగ్ పాయింట్ లభిస్తే చాలు.. మొత్తం రాజకీయాలే మారిపోతాయి. అయితే ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో జరుగుతున్న జడ్పిటిసి ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కేవలం పదివేల 600 ఓట్లు ఉన్న ఈ మండలంలో.. ఎవరిది గెలుపు? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకం. అంతకుమించి చంద్రబాబుకు సైతం కీలకం.
ALso Read: పులివెందుల, ఒంటి మిట్ట రెండు జెడ్పీ టీసీ స్థానాల కోసం ఎందుకింత రచ్చ..? ఎవరు గెలుస్తారు?
ఇరువురికి ప్రతిష్టాత్మకమే..
కూటమి ( Alliance ) అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. ఏకపక్షంగా గెలిచిన టిడిపి కూటమి తిరుగులేని అధికారం చెలాయిస్తోంది. అయితే భారీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సరిగ్గా ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఉప ఎన్నిక రావడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ గానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గక పోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత ఇబ్బందులు పడడం ఖాయం. ఒకవేళ టిడిపి ఓడిపోతే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై పాలు పోసినట్టే. ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఆ పార్టీ మరింతగా దూకుడుగా ముందుకు సాగుతుంది. అందుకే ఈ ఎన్నిక జగన్మోహన్ రెడ్డి తో పాటు చంద్రబాబుకు ఒక పరీక్ష.
ఏడాది పదవీకాలం ఉండగా పులివెందుల( pulivendula) జడ్పిటిసి గా ఉన్న మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2022లో చనిపోతే నిర్వహించలేదు. అయితే ఇంకా ఏడాది పదవీ కాలం మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ఎన్నికను నిర్వహించి వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టించాలని టిడిపి భావించింది. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోటీలోకి దిగారు బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి. అయితే సొంత గడ్డలో గెలవడం జగన్మోహన్ రెడ్డికి కీలకం. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణ సంకటం కూడా. 1978 నుంచి ఇప్పటివరకు పులివెందులపై స్పష్టమైన ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది వైయస్సార్ కుటుంబం. దాదాపు స్థానిక సంస్థలు జరిగిన ప్రతిసారి పులివెందుల జడ్పిటిసి స్థానం ఏకగ్రీవం అవుతూ వచ్చింది. 1995లో ఏకగ్రీవం అయింది. 2006, 2013, 2021.. ఇలా ఎన్నిక ఎప్పుడు జరిగినా ఏకగ్రీవం అవుతూ వచ్చింది. కనీసం టిడిపి అభ్యర్థులు పోటీ చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. అటువంటిది ఈసారి టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గట్టిగానే పోటీ ఇస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం ప్రమాదకరమే. టిడిపి ఓడిపోతే అది తమ సీటు కాదని.. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తమ సత్తా చూద్దామని సరిపెట్టుకునే అవకాశం ఉంది. అయితే జగన్ కు ఇంకా ప్రజాబలం తగ్గలేదని భావించాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడం పులివెందుల ప్రజలు చూడలేదు. వారికి మాత్రం ఇదో అరుదైన చాన్స్. రేపు పోలింగునకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈనెల 14న ఫలితాలు వెల్లడించనున్నారు. అప్పటివరకు హై టెన్షన్ వాతావరణం తప్పదు.
Also Read: రాహుల్ గాంధీతో జగన్ భేటీ
పోలీసుల విస్తృత తనిఖీ..
మరోవైపు పులివెందుల మండలంలో పటిష్ట బందోబస్తు మధ్య రేపు పోలింగ్ జరగనుంది. దాదాపు 1500 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. అయితే పులివెందులలో స్థానికేతరులు పెద్ద ఎత్తున ప్రవేశించారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లెలో పోలీసులు తనిఖీ చేపట్టారు. స్థానిక వైసీపీ నాయకుడు బలరామరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. 15 మంది స్థానికేతరులు ఉన్నట్లు గుర్తించారు. అయితే అందులో కొందరు పారిపోయినట్లు తెలుస్తోంది.