War 2 Pre Release Event Trolls: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ఎంత అట్టహాసంగా జరిపించారో మనమంతా చూసాము. వాస్తవానికి యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వంటి వాటికి దూరం గా ఉంటారు. తమ సినిమాలోని హీరోలకు సంబంధించిన లుక్స్ బయట పబ్లిక్ లో ఎక్కువ చూపించడానికి ఇష్టపడరు. కానీ తెలుగు లో ప్రొమోషన్స్ లేకపోతే కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రావు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి అత్యంత అవమానకరమైన ఓపెనింగ్ వసూళ్లు వస్తాయి. ఆ కారణం చేతనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసిన నాగవంశీ పట్టుబట్టి మరీ నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయించాడు.
Also Read: ‘మాస్ జాతర’ మూవీ టీజర్ చూస్తే ఆ సినిమానే గుర్తుకు వస్తోందిగా..?
ఇద్దరు హీరోలు కలిసి వస్తున్న ఈవెంట్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ భారీ ఎత్తున బందోబస్తు ని ఏర్పాటు చేయించింది. సుమారుగా 1200 మంది పోలీసులను దింపారు. కానీ ఈ ఈవెంట్ కి వచ్చిన జనాలకంటే, పోలీసులే ఎక్కువ ఉన్నారని, అసలు జనాలే లేరని ఈ ఈవెంట్ కి సంబంధించిన ధ్రోన్ షాట్స్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్. ఈ స్క్రీన్ షాట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ మీద విపరీతమైన ట్రోల్స్ పడ్డాయి. అయితే సోషల్ మీడియా లో వైరల్ అయిన ఆ స్క్రీన్ షాట్ ఈవెంట్ ప్రారంభం అయ్యే ముందు తీసినది అని, ఈవెంట్ మొదలయ్యాక జనాలు పెద్ద ఎత్తున హాజరయ్యారని. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్టేజి ఎక్కే సమయానికి గ్రౌండ్ మొత్తం నిండిపోయిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధారాలతో సహా నిరూపించారు.
Also Read: ‘పరదా’ మూవీ ట్రైలర్ లో ఆ ఒక్కటి తగ్గిందా..?
దీంతో ఎన్టీఆర్ ని ట్రోల్ చేసిన వాళ్ళందరూ సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇది అసలు మ్యాటర్. ఇదంతా పక్కన పెడితే నిన్న ఎన్టీఆర్ ఇచ్చిన ప్రసంగం ఈ సినిమాకు మంచి హైప్ ని తెచ్చిపెట్టింది. ఆయన రెండు కాలర్స్ ని ఎగరేసిన మూమెంట్ అభిమానులకు మంచి కిక్ ని ఇచ్చింది. ఎన్టీఆర్ ఇచ్చిన ప్రసంగం తాలూకు ప్రభావం నార్త్ అమెరికా లోని అడ్వాన్స్ బుకింగ్స్ పై పడింది. ప్రారంభం నుండి మొన్నటి వరకు చాలా తక్కువ గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజే తెలుగు వెర్షన్ నుండి 40 వేల డాలర్లు జంప్ రావడం గమనార్హం. రేపు, ఎల్లుండి కూడా ఇదే రేంజ్ జుంప్స్ ని ఈ చిత్రం సొంతం చేసుకోగలిగితే ఎన్టీఆర్ పరువు తెలుగు వెర్షన్ వరకు నిలబడుతుందని అంటున్నారు విశ్లేషకులు.