Hidden camera Issue: అట్టుడుకుతున్న హిడెన్ కెమెరాలో చిచ్చు.. అసలు కారకులు ఎవరు?

ఏకంగా బాలికల బాత్రూంలోనే హిడెన్ కెమెరాలు అమర్చారు. ఇందుకు ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో బాయ్ ఫ్రెండ్స్ ఈ ఘాతుకానికి దిగినట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : August 30, 2024 12:56 pm

Hidden camera Issue

Follow us on

Hidden camera Issue: ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టడం సంచలనం గా మారింది. తీవ్ర కలకలం రేపుతోంది.అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టి.. ఆ వీడియోలను పలువురికి షేర్ చేస్తున్నారు అన్న దారుణ ఆరోపణలు రావడం తల్లిదండ్రులు ఆందోళనకు కారణం అవుతోంది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దారుణం వెలుగు చూసింది. బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉండడాన్ని విద్యార్థినులు గుర్తించారు. వెంటనే హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.అయితే యాజమాన్యం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్స్ లైట్స్ చేతపట్టి ఆందోళన చేపట్టారు. తెల్లవారుజాము 3 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగింది.

* తొలుత ఓ విద్యార్థి పాత్ర
అయితే ఈ ఘటనపై ఓ విద్యార్థి పాత్ర బయటపడింది. కానీ ఆయనకు సహకరించింది మాత్రం ఓ విద్యార్థిని కావడం విశేషం. అయితే మొత్తం వ్యవహారం నడిపింది ఆ అమ్మాయి అని తేలింది. తన బాయ్ ఫ్రెండ్స్ కోసమే ఈ దుశ్చర్యకు దిగిందని తేలడం ఆందోళన కలిగిస్తోంది. మరో అమ్మాయి పాత్రపై అనుమానాలు ఉన్నాయి. ఆమె వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉండడంతో..ఇద్దరు అమ్మాయిలే బాత్రూంలో హిడెన్ కెమెరాలు అమర్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

* అన్ని కోణాల్లో దర్యాప్తు
అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఆ ఇద్దరూ అమ్మాయిలే ఉన్నారా? వారిని బాయ్ ఫ్రెండ్స్ ఎలా ట్రాప్ చేశారు?వీరిద్దరికీ హెడెన్ కెమెరాలు ఇచ్చింది ఎవరు? వీరిని ప్రలోభ పెట్టారా? లేకుంటే డబ్బులు ఆశ చూపారా?దీని వెనుక పెద్దలు ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు.విచారణకు ఆదేశించారు.పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

* రాజకీయ రంగు
మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసిపి ఇప్పటికే రంగంలోకి దిగింది. విద్యార్థుల ఆందోళన వీడియోలను వైసీపీ షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్ లకు ట్యాగ్ చేసి దర్యాప్తునకు డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వం స్పందించింది. తక్షణం జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలు ఘటనా స్థలాన్ని సందర్శించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు టిడిపి తన ఎక్స్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది. మొత్తానికి అయితే ఏపీలో ఈ వ్యవహారం పెను సంచలనాలకు కారణం అవుతోంది.