Jagan – Sharmila property dispute : విజయలక్ష్మి రాసిన లేఖను టిడిపి అనుకూల మీడియా బొంబాట్ గా ప్రచురించింది. ఇప్పటికీ ప్రచురిస్తూనే ఉంది. ఏదో ఒక విషయాన్ని తెరపైకి తెచ్చి.. దానిని సంచలనంగా మార్చుతోంది. వీటికి కౌంటర్ ఇవ్వడంతోనే సాక్షికి సరిపోతోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలైంది. ఒకవేళ అందరూ అనుకున్నట్టుగా ఆస్తుల పంపకాల జరుగుతే సాక్షి షర్మిలకు వెళుతుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైయస్ విజయమ్మ కూడా తన లేఖలో అదే విషయాన్ని ప్రస్తావించింది. మొత్తంగా చూస్తే సాక్షి జగన్మోహన్ రెడ్డికి కాకుండా షర్మిలకు వెళ్లిపోతే అది వైసీపీకి పెద్ద లాస్ అవుతుందని తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం మీడియా ఉండాలని.. సాక్షిని ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించారు. రంగుల రంగులతో సాక్షి నాడు ప్రారంభమైంది. సాక్షి ఛానల్ కూడా అత్యంత డిజిటల్ హంగులతో ప్రసారాలను ప్రారంభించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గతించిన తర్వాత సాక్షి జగన్ లైన్ తీసుకుంది. వైసిపిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీకి మౌత్ పీస్ లాగా సాక్షి మారిపోయింది. నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. అ పాదయాత్రకు సాక్షి విపరీతమైన కవరేజ్ ఇచ్చింది. ఇప్పుడు షర్మిల – జగన్ మధ్య ఆస్తుల విభేదాలు మొదలు కావడంతో.. షర్మిలకు వ్యతిరేకంగా సాక్షిలో కథనాలు ప్రచురితమవుతున్నాయి.
ఏం జరుగుతుంది?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సాక్షి ఒకవేళ షర్మిల చేతుల్లోకి వెళ్లిపోతే పరిస్థితులు మారిపోతాయని తెలుస్తోంది. ఇప్పుడు సాక్షిలో ఉన్న డైరెక్టర్లు, పై స్థాయిలో ఉన్న వ్యక్తులు మొత్తం కూడా జగన్, భారతి రెడ్డికి అత్యంత అనుకూలమైన మనుషులు. ఒకవేళ సాక్షి కనుక చేతులు మారితే వారంతా తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. సాక్షిని నడిపించాలంటే ఆ పదవులను కొత్తవారితో షర్మిల భర్తీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు తనకంటూ ఒక మీడియా కావాలి కాబట్టి జగన్ కొత్త సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. జగన్ వద్ద సాధన సంపత్తి భారీగానే ఉంది కాబట్టి దానిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం పెద్ద కష్టం కాదని మీడియా వర్గాలు అంటున్నాయి.. ఇక సాక్షి షర్మిల చేతుల్లోకి వెళ్లిపోతే హైదరాబాదులోని భారీ భవనం.. జిల్లా కార్యాలయాలు కూడా ఆమెకే దక్కుతాయని తెలుస్తోంది. అప్పుడు జగన్ తాను ఏర్పాటు చేయబోయే మీడియా సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలలో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వైసిపి ఆంధ్రలో మాత్రమే రాజకీయాలు చేస్తోంది కాబట్టి.. ఆయన ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో ఏర్పాటు చేస్తే.. అది భారత రాష్ట్ర సమితి అనుకూల స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత పది సంవత్సరాలుగా సాక్షి భారత రాష్ట్ర సమితికి అనుకూలంగానే వ్యవహరించింది. అది నమస్తే తెలంగాణ -2 గా వ్యవహరించింది. కెసిఆర్, కేటీఆర్ తో జగన్ కు అత్యంత సఖ్యంగా ఉన్నారు. స్థూలంగా చూస్తే సాక్షి షర్మిల వైపు వెళ్లిపోతే తెలుగు మీడియాలోనూ సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు ప్రింట్ మీడియాలో సాక్షి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఏపీలోనూ అదే పరిస్థితి. ఒకవేళ సాక్షి విభజన జరిగితే అప్పుడు దాని భవితవ్యం ఏంటనేది త్వరలో తేలిపోతుందని తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: What will be jagans situation if sakshi goes to sharmila in the transfer of assets
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com