TTD Laddu Issue: తిరుమల లడ్డు వివాదంలో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. దాని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. వైసీపీ హయాంలోనేనెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. చేసింది అధికార పక్షం. దీనిని తిప్పి కొట్టాల్సిన అవసరం వైసీపీపై ఉంది. కానీ వైసీపీ తరఫున మాట్లాడిన నేతలు ఎవరు ప్రజల్లో ఫేమ్ ఉన్నవారు కాదు.గత ఐదేళ్లుగా వీరు మాట్లాడిన తీరు ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించారు. కానీ ఇప్పుడు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ అదే నేతల మాట్లాడుతుండడంతో ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా లడ్డు తయారీ నాణ్యత పై వస్తున్న విమర్శలపై దృష్టి పెట్టింది. అలా లడ్డు నాణ్యత పైపరిశీలన చేసిన క్రమంలో.. నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది ఒక ల్యాబ్ లో తేలింది. దీంతో ఆ విషయాన్ని బయటపెట్టారు చంద్రబాబు. ఆయన రాజకీయ కోణంలో బయటపెట్టి ఉంటారన్నది ఒక అనుమానం. అయితేఇది సున్నితమైన విషయం.అక్కడే వైసిపి జాగ్రత్తగా అడుగులు వేయాలి.కానీఈ విషయంలో వైసీపీ నేతలు తప్పటడుగులు వేశారు. ముఖ్యంగా వివాదాస్పద నాయకులు ఈ అంశంపై స్పందించడం తొలి తప్పిదం. టిటిడి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న క్రమంలో నిలిపివేయాలని కోరుతూ టీటీడీ ట్రస్ట్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించడం కూడా ప్రజల్లో అనుమానాలు బలపడే అవకాశం ఇచ్చింది.
* జగన్ వెనక్కి తగ్గడం మైనస్
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం అంటూ జగన్ తిరుమలలో పూజలు చేస్తానని ప్రకటించారు. నేరుగా తిరుమల షెడ్యూల్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం తిరుమల వెళ్లి.. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం, టీటీడీ అనూహ్యంగా డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో డిక్లరేషన్ ఇస్తే..గతంలో ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న వస్తుంది. ఒకవేళ ఇవ్వకుంటే దేవాదాయ శాఖ నిబంధనలు ప్రకారం కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మతపరమైన అంశం తెరపైకి వస్తుంది. దీంతో జగన్ వెనక్కి తగ్గి వైసిపి శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళానికి కారణమయ్యారు.
* రోజా లాంటి వారి తీరుతో నష్టం
ఇక మాజీ మంత్రి రోజా లాంటి వారితో మాట్లాడించడం కూడా ఒక రకమైన ఇబ్బందికర పరిణామమే. ఆమె తీరుపై ప్రజల్లో ఒక రకమైన అసహ్యం ఉంది. నిజంగా ఆమె ప్రభుత్వంపై అనుమానిత పూరిత అంశాలు లేవనెత్తిన ప్రజల్లోకి వెళ్ళవు. అంతలా ఆమె ప్రజల్లో ఒక చర్చకు కారణమయ్యారు. ప్రత్యర్థులపై అనవసరంగా నోరు పారేసుకుంటారని గుర్తింపు పొందారు. అటువంటి ఆమెతో విమర్శలు చేయించడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొడాలి నాని వంటి వారు కూడా ఈ ఇష్యూ పై మాట్లాడారు. ఆయనపై సైతం అభ్యంతరాలు ఉన్నాయి. మాజీ స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఆవుపై నెపం మోపడం ప్రజల్లో చులకన చేసింది.
* వైవి సుబ్బారెడ్డి మౌనం
ఈ వివాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. నివృత్తి చేయాల్సింది అప్పటి టీటీడీ చైర్మన్. ఆ హోదాలో పని చేసిన వైవి సుబ్బారెడ్డి తనకు ఏది కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం మీడియా ముందుకు రావడం లేదు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. పైగా టిటిడి పై విజిలెన్స్ విచారణ వద్దని ఆయన కోర్టుకు వెళ్లడం ఈ సందర్భంలో మంచిది కాదు. ఒకవేళ వైసీపీ హయాం లో ఎటువంటి తప్పిదం జరగకపోయినా.. వైసిపి వ్యవహరించిన తీరు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడు ఈ పరిణామాలతో వైసిపి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదంతా స్వయంకృతాపమే అంటున్నారు విశ్లేషకులు.