Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan land issue controversy: పవన్ కళ్యాణ్ కు భూకబ్జా చేయాల్సిన కర్మ ఏంటి.....

Pawan Kalyan land issue controversy: పవన్ కళ్యాణ్ కు భూకబ్జా చేయాల్సిన కర్మ ఏంటి.. అసలు వాస్తవాలు ఇవి కదా

Pawan Kalyan land issue controversy: ఊసుపోని వ్యక్తులకు ఊరివారందరి వ్యవహారాలు కావాలి. వారి మీద ఇంత మన్ను పోయడానికి అవకాశం కావాలి. ఇప్పుడు ఇలానే ఉంది కొంతమంది పరిస్థితి. తెలంగాణ ప్రాంతం నుంచి రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నవారు.. పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతున్నారు. పవన్ కళ్యాణ్ భూమి కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీలో ఉన్న ఓ ఎమ్మెల్యే హైదరాబాదులో భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డాడు. గండిపేట లో ఉన్న ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోలతో కొట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆ భూమి విలువ అచ్చంగా 1500 కోట్లు. ఇప్పటికే ఈ దందాలో నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ అనే వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ దందాకు పాల్పడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. బొల్లా రమేష్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.

వాస్తవానికి వైసీపీ మీద విమర్శలు చేస్తూ.. తెలంగాణ ప్రాంతంలో భూ కుంభకోణాలకు పాల్పడిన వీరి మీద ఆగ్రహం వ్యక్తం చేయాలి. కానీ తెలంగాణలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అలా వ్యవహరించడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ భూమి కబ్జాకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు శంకర్పల్లి ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంపై అవాస్తవాలు మాట్లాడుతున్నారు.

2014 డిసెంబర్ 15న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 182 సెక్షన్ 54 ఆధారంగా ఆ భూమిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు.

రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ఆధారంగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదు చేసుకున్నారు. ఇక్కడ రిజిస్టర్ డాక్యుమెంట్ అంటే యాజమాన్యానికి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వు.

ఇక్కడ ఎఫ్టిఎల్ నిబంధనలు అనేవి నిర్మాణాల మీద మాత్రమే వర్తిస్తాయి. యాజమాన్య హక్కుల మీద వర్తించవు.

వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగి ఉన్న భూమిని శిఖం పట్టా భూమి అంటారు. కొంతమంది వీటిని ప్రభుత్వ భూమిగా చెబుతుండడం నిజంగా అజ్ఞానం.

తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారం మ్యుటేషన్లు.. ఖాతా నెంబర్లు.. ఒకే వ్యక్తికి ఒకే ఖాతాలో ఉండాలని లేదు.

ఇవన్నీ కూడా ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. చట్టబద్ధమైన పత్రాల ఆధారంగా పవన్ కళ్యాణ్ భూములు కొనుగోలు చేస్తే.. కొంతమంది అమ్ముడుపోయిన వ్యక్తులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.

భూకబ్జా గురించి పదే పదే చెబుతున్న వ్యక్తులు ఒక ఆధారమైనా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చూపించాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా పొందిన భూమిని కబ్జా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని వారి ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి.. ప్రజలను మభ్యపెట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version