Surface Laptop Ultra NVIDIA features: Microsoft తన అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్ Surface Laptop Ultraని ప్రకటించింది. ఇది NVIDIAతో కలిసి అభివృద్ధి చేసిన అత్యాధునిక ల్యాప్‌టాప్. AI తో పాటు 3D రెండరింగ్, భారీ కంటెంట్ క్రియేషన్ వంటి పనులకు అనుకూలంగా ఉండే ఇందులో ఊహకందని ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లతో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చని టెక్ నిపుణులు అంటున్నారు. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దీని ధర ఎంతో తెలుసుకుందాం..
Surface Laptop Ultra NVIDIA రెంట్ షార్క్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్ పై రావడం Microsoft ల్యాప్‌టాప్‌లలో ఇదే మొదటిసారి. ఇందులో ఎన్విడా బ్లాక్ వెల్ RTX GPU ఉంటుంది. ఇది పూర్తి CUDA సపోర్ట్‌తో పెటాఫ్లాప్ వరకు AI కంప్యూటింగ్ పవర్‌ను అందిస్తుంది. దీంతో 120 బిలియన్ పారామీటర్ల వరకు గల AI మోడల్‌లను క్లౌడ్‌పై ఆధారపడకుండానే లోకల్‌గా రన్ చేయగలదు.
ఈ ల్యాప్‌టాప్‌లో వరకు 128GB వరకు యూనిఫైడ్ మెమరీ ఉంది. ఇది సీపీయూ, జీపీయూ రెండూ ఒకే మెమరీ పూల్‌ను యాక్సెస్ చేసుకునేలా చేస్తుంది. యూనిఫైడ్ మెమరీ ఆర్కిటెక్చర్ AI వర్క్‌లోడ్స్, రెండరింగ్ టాస్క్స్, పెద్ద డేటాసెట్‌లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సాంప్రదాయక ల్యాప్‌టాప్ ఆర్కిటెక్చర్‌ల కంటే భిన్నంగా, వేర్వేరు మెమరీలను వేరు చేయకుండా ఏకీకృతం చేస్తుంది.
Surface Laptop Ultraలో 15 అంగుళాల పిక్సెల్ సెన్స్ అల్ట్రా టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఇది మినీ ఎల్ ఈడీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ డిస్ప్లే 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. 262 PPI పిక్సెల్ డెన్సిటీ, హై-ప్రెసిజన్ కలర్ రిప్రొడక్షన్‌ను అందిస్తుంది.
ఇతర ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే, Surface Laptop Ultraలో USB-C యాడాప్టర్లపై ఆధారపడకుండా HDMI, USB-C, USB-A, SD కార్డ్ స్లాట్, హెడ్‌ఫోన్ జాక్ వంటి వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది డెవలపర్స్ AI బిల్డర్స్ , క్రియేటర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. భారీ 3D సీన్స్, పొడవైన కంపైల్ టైమింగ్స్, బహుళ మోడల్‌లను రన్ చేయడం వంటి కఠినమైన వర్క్‌లోడ్స్‌ను హ్యాండిల్ చేయగలదు.Microsoft Surface Laptop Ultra ధర మరియు విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అంది ఇది 2026 చివరిలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 కోసం ఆప్టిమైజ్ చేయబడిన NVIDIA DGX షార్క్ మిని-పీసీ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
