spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: ఏపీ లో సడెన్ గా పోస్టల్ బ్యాలెట్స్ పెరగడం దేనికి సంకేతం.....

AP Elections 2024: ఏపీ లో సడెన్ గా పోస్టల్ బ్యాలెట్స్ పెరగడం దేనికి సంకేతం.. ఎవరికి లాభం?

AP Elections 2024: ఏపీ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష కూటమిల మధ్య గట్టి యుద్ధమే నడుస్తోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసిపి అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఎలాగైనా జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. బిజెపి మద్దతుతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఓటు కీలకంగా మారింది ముఖ్యంగా ఈసారి ఉద్యోగుల బ్యాలెట్ ఓటు ప్రాధాన్యత అంశంగా మారింది. పార్టీల గెలుపోటములను నిర్దేశించనుంది.ఏపీలో హోరా హోరీ ఫైట్ నేపథ్యంలో బ్యాలెట్ ఓటు కీలకంగా మారనుంది. తక్కువ ఓట్లతో గెలుపొటములు ఉంటాయని నిపుణులు భావిస్తున్న తరుణంలో బ్యాలెట్ ఓటు కీలక భూమిక పోషించనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈసారి శత శాతం ఓట్లు వేయడానికి మొగ్గు చూపించారు.

ఈనెల 13న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ దాదాపు ఆరు రోజులు పాటు కొనసాగింది. ఈనెల నాలుగున ప్రారంభమైన ఓటింగ్ 10వ తేదీ వరకు కొనసాగుతూనే ఉంది. ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితోపాటు 85 ఏళ్లు నిండిన వయోవృద్ధుల కోసం హోం ఓటింగ్ ఈసారి నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార వైసీపీ పై ఉన్న అసహనం, ఆగ్రహం స్పష్టంగా కనబడింది. ఇప్పటివరకు అన్ని వర్గాలు తమ వైపు ఉన్నారని భావించిన వైసీపీకి గట్టి షాక్ తగిలింది.

అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వైసిపి పై ఉన్న సానుకూలత క్రమేపి తగ్గుముఖం పడుతోంది. సోషల్ మీడియాలో సైతం వ్యతిరేక విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగ ఉపాధ్యాయ ఓట్లన్నీ తమకేనని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉన్న అధికార పార్టీ ఇప్పుడు చేతులెత్తేసింది. సమయానికి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తిప్పలు పెట్టారని.. టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని.. వారితో పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగించారని.. అన్ని శాఖల ఉద్యోగుల స్వేచ్ఛను హరించినందుకు.. తమ ఆగ్రహం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రూపంలో ఉద్యోగ ఉపాధ్యాయులు చూపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పష్టంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ లలో టిడిపి కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది.

అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ విపక్షనేతగా హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. తన పాలన 30 నెలలు గడిచిన తర్వాత.. ప్రభుత్వముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా క్షమించండి అని జగన్ ప్రకటించారు. అదో సాంకేతిక అంశమని.. తెలియకుండా హామీ ఇచ్చానని.. తప్పయిపోయిందని ప్రకటన చేయించారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, వసతులను సైతం రద్దు చేశారు. జీతాలు సైతం సక్రమంగా చెల్లించలేదు. ఇవన్నీ ప్రతికూలత చూపాయి. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఉద్యోగ,ఉపాధ్యాయుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందన్న ఆందోళన సర్వత్ర వ్యక్తమవుతోంది. అందుకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత.. కూటమి వైపు ఉద్యోగ, ఉపాధ్యాయులు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper