Weather Report : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు( summer ) మండుతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మంగళవారం ఎండలు తీవ్ర రూపం దాల్చుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండ తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ప్రజలు బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు వర్ష హెచ్చరిక కూడా రాష్ట్రానికి ఉంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ. అయితే ఒక వైపు రాష్ట్రం నిప్పుల కొలిమిలా ఉండగా.. మరోవైపు వర్ష సూచన ఉండడం విశేషం.
Also Read : అమరావతికి 44 వేల ఎకరాలు.. చంద్రబాబు ప్లాన్ అదే!
* మరో రెండు రోజులు ఇంతే..
రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారిగా వాతావరణం లో మార్పు జరిగింది. విపరీతమైన వడగాలు వీస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అటు తెలంగాణలో( Telangana) సైతం అదే పరిస్థితి ఉంది. ఏపీలో అకాల వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక బులిటెన్ జారీ చేసింది. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సైతం 42.7 గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
* గడిచిన 24 గంటల్లో..
గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు( temperature) నమోదయ్యాయి. వడగాలులు ఎక్కువగా వీచాయి. ఏపీలోని 66 మండలాల్లో స్వల్పంగా, ఏడు మండలాల్లో తీవ్రంగా నమోదయ్యాయి. రాయలసీమలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా వైయస్సార్ కడప జిల్లా అట్లూరులో 41.4 డిగ్రీలు నమోదు అయ్యాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య వడగాలుల తీవ్రత ఉంది. ఆ సమయంలోనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
* ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏప్రిల్ 13 నుంచి 16 మధ్య సాధారణ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఒకవైపు ఎండ, మరోవైపు వర్షాలు పడుతూ వాతావరణం విచిత్రంగా కనిపిస్తోంది. అయితే సాధారణంగా ఏప్రిల్ నెలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలే ఈ భిన్న వాతావరణానికి కారణం. వర్షాలు, సముద్ర తీర ప్రాంతాల సామీప్యత వల్ల ఆర్ద్రత స్థాయిలు పెరుగుతున్నాయి. కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. అక్కడక్కడ వడగండ్ల వానలు పడ్డాయి. ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read : సెగలు కక్కుతున్న భానుడు.. ఏపీలో ఆ జిల్లాలకు బిగ్ అలెర్ట్!