Vizianagaram : విజయనగరంలో( Vijayanagaram) ఉగ్ర మూలాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఉగ్రవాద జాడలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరు పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారి. కానీ సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలం వైపు అడుగులు వేశాడు. సౌదీలోని ఓ ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా చేరాడు. ఇండియాకు చెందిన ఓ అయిదుగురుతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. చివరకు పోలీస్ నిఘా ఉండడంతో.. పేలుడు పదార్థాలతో పట్టుపడ్డాడు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో ఆర్థిక, సామాజిక, కుటుంబ స్థితిగతులపై దర్యాప్తు చేస్తోంది.
Also Read : పాకిస్తాన్‌లో రాహుల్ గాంధీ ట్రెండింగ్.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రశ్నలతో పతాక శీర్షికలో..
* లోతుగా విచారణ..
ఇప్పటికే సిరాజ్( Siraj) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు.. లోతుగా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్ అకౌంట్ గా భావిస్తున్న దాంట్లో 42 లక్షల వరకు నగదు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అందుకే మిగిలిన బ్యాంకుల్లో ఏమైనా ఖాతాలు ఉన్నాయా? ఉంటే అందులో ఎంత మొత్తం ఉందని అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్ తో సహా అతని కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అందజేయాలని విజయనగరంలోని బ్యాంక్ అధికారులను దర్యాప్తు అధికారులు కోరారు.
* డిసిసిబి బ్యాంకులో అకౌంట్లు..
అయితే పేరు మోసిన బ్యాంకులు ఉంటే.. సిరాజ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు డిసిసిబి( district Central Cooperative Bank) బ్యాంకులో అకౌంట్లో ఉండడం విశేషం. సిరాజ్ పేరుతో సేవింగ్ ఒకటి, ఫిక్స్డ్ డిపాజిట్ కు సంబంధించిన రెండు ఎకౌంట్లు ఉన్నాయి. మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులకు ఇదే బ్యాంకులో నాలుగు ఖాతాలు ఉండడం విశేషం. పోలీస్ శాఖలో ఏఎస్ఐ గా పని చేస్తున్న సిరాజ్ తండ్రికి లాకర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది కిందట వరకు కొత్తవలస లో నివాసం ఉండేది. అయితే సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్కు బదిలీ కావడంతో… తన బ్యాంక్ అకౌంట్ ను కొత్తవలస నుంచి విజయనగరానికి మార్చుకున్నాడు సిరాజ్. అయితే ఆయన తండ్రి అకౌంట్ మాత్రం కొత్తవలస లోనే కొనసాగుతోంది. అయితే సిరాజ్ ఖాతాలో డిపాజిట్లు తప్ప విత్డ్రాలు కనిపించడం లేదు. ఇతర కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో 70 లక్షల రూపాయలు ఉన్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది.
* బ్యాంక్ లాకర్ తెరిచేందుకు ప్రయత్నం..
అయితే కుమారుడు సిరాజ్ అరెస్టయ్యాడు. ఆ సమయంలోనే తండ్రి లాకర్( Bank locker ) తెరిచేందుకు ప్రయత్నించడం దర్యాప్తు అధికారుల దృష్టికి వెళ్ళింది. శనివారం రాత్రి సిరాజ్ అరెస్టయ్యారు. అతని ఇంట్లో జరిపిన సోదాలతో కుటుంబ సభ్యులు అప్రమత్తం అవుతారని భావించి.. దర్యాప్తు అధికారులు వారి కదలికలపై నిఘా ఉంచారు. ఆదివారం సెలవు దినం కాగా.. సోమవారం విజయనగరం డిసిసిబి లో తన పేరిట ఉన్న లాకర్ ను తెరిచేందుకు సిరాజ్ తండ్రి బ్యాంక్ అధికారులను కలిశారు. అయితే అప్పటికే పోలీసుల ఆదేశాలు ఉండడంతో కుదరదని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. అయితే మంగళవారం మరోసారి యూనిఫాంలో సిరాజ్ తండ్రి బ్యాంకుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా బ్యాంక్ అధికారులు అనుమతించకపోవడంతో ఆయన నిరాశతో వెళ్లిపోయినట్లు సమాచారం. మొత్తానికైతే సిరాజ్ ఆర్థిక పరిస్థితి బట్టి కూడా ఈ కేసు తీవ్రత తేలే అవకాశం ఉంది.