Vizag Yoga Day Controversy : నేడు వైజాగ్ RK బీచ్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంత అట్టహాసంగా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ముఖ్య అతిథి గా పాల్గొన్న ఈ వేడుక లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా పాల్గొన్నారు. యోగ దినోత్సవం గురించి ఈ ముగ్గురు ముఖ్య నాయకులూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రసంగాలు ముగిసిన తర్వాత ఈ ముగ్గురు కూడా జనాలతో కలిసి యోగాసనాలు చేయడం ప్రత్యేకతని సంతరించుకుంది. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే విపక్ష పార్టీ వైసీపీ బీచ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ బ్యానర్స్ లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్(Nara Lokesh) ఫోటోలు ఉండడం పై తప్పుబట్టింది.
ఈ సందర్భంగా వైసీపీ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ నుండి వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ఆ ట్వీట్ లో ఏముందంటే ‘సుప్రీమ్ కోర్టు రూల్స్ ప్రకారం ప్రభుత్వ తరుపున ప్రకటనల్లో ప్రధాన మంత్రి ఫోటో ఉన్నప్పుడు ఆయన పక్కన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొట మాత్రమే వాడాలి. ఇతర మంత్రుల ఫోటోలు కానీ, మరే ఇతర నాయకుల ఫోటోలు కానీ ఉండకూడదు. కానీ వైజాగ్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమ ప్రకటనల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు ఉన్నాయి. ఇది నియమాలకు పూర్తిగా విరుద్ధం. వీళ్లిద్దరి ఫోటోలను పెట్టి, మిగిలిన మంత్రుల ఫోటోలు పెట్టకపోవడం ముమ్మాటికీ వాళ్ళందరిని అవమానించడమే’ అంటూ వైసీపీ సోషల్ మీడియా వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ట్వీట్ పై భిన్నమైన స్వరాలూ కూడా వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ కి, వైసీపీ పార్టీ నాయకులకు పీకలదాకా కోపం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని పేరు రాసి బ్రాకెట్ లో డిప్యూటీ సీఎం పదవి కి ఎలాంటి రాజ్యాంగ హక్కు లేదని ప్రస్తావించడం పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపమే కారణమని అంటున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు. జగన్ కి కానీ, అతని అనుచరులకు కానీ, చంద్రబాబు,నారాలోకేష్ పై కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ పై కోపం కసి ఉన్నాయని, ఎందుకంటే 11 సీట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ కట్టిన కూటమి వల్లనే అని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా ఆ ట్వీట్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో ప్రధాన మంత్రి ఫోటో ఉన్నప్పుడు పక్కన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో మాత్రమే వాడాలి. మరే ఇతర మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం ( డిప్యూటీ సీఎం పదవికి ఎలాంటి రాజ్యాంగ బద్ద హోదా లేదు) ఫోటోలు కానీ వాడకూడదు. ఇలా వాడడం… pic.twitter.com/RtnIDSoZTU
— YSR Congress Party (@YSRCParty) June 20, 2025