Manchu Vishnu Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన కన్నప్ప(Kannappa Movie) చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కూడా వస్తాడని అంతా అనుకున్నారు కానీ, విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినట్టు తెలుస్తుంది. కానీ ఈ చిత్రం లో నటించిన తమిళ నటుడు శరత్ కుమార్(Sarath Kumar) మాత్రం ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ చిత్రం లో పని చేసిన ప్రతీ ఒక్కరి మాటలను వింటుంటే సినిమా చాలా బాగా వచ్చినట్టుగా అనిపించింది. థియేట్రికల్ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ఆడియన్స్ కూడా ఈ చిత్రం పై ఆసక్తి పెంచుకున్నారు. పర్లేదు సినిమాలో మ్యాటర్ ఉంది అని ట్రైలర్ ని చూసిన తర్వాత బలంగా నమ్మారు.
Also Read: బిచ్చగాడి క్యారెక్టర్ లో బాలయ్య ను బీట్ చేయలేకపోయిన ధనుష్…
ఇదంతా పక్కన పెడితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు విష్ణు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘తనికెళ్ల భరణి అంకుల్ నుండి 2014 సంవత్సరం లో కన్నప్ప స్టోరీ హక్కులను పొందాను. ఆ తర్వాత ఈ కథకు మెరుగులు దిద్ది పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించేలా ప్రణాళికలు చేసుకున్నాము. ఇంత పెద్ద చిత్రం నేను చేయగలనా లేదా అనే సందేహం నాలో ఉండేది. ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూస్తున్నప్పుడు ఇది అసలు నా సినిమానేనా అనే సందేహం కలిగింది. అంత అద్భుతంగా వచ్చింది ఈ చిత్రం. శివానుగ్రహం వల్లే ఈ చిత్రాన్ని నేను పూర్తి చేయగలిగాను. ఆయన అనుగ్రహం కారణంగానే ప్రభాస్, మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar) వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో భాగం అయ్యారు, వాళ్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు’.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన తమిళ నటుడు శరత్ కుమార్ గురించి మాట్లాడుతూ ‘శరత్ కుమార్ గారు నాకు చిన్నతనం నుండి తెలుసు. ఆయన నాకు కన్నతండ్రి వంటి వారు. కన్నప్ప చిత్రం ఈ నెల 27 న తమిళనాడు లో అంత గ్రాండ్ గా విడుదల కాబోతుందంటే అందుకు కారణం శరత్ కుమార్ గారే. డిస్ట్రిబ్యూషన్ పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని మేము తేలికగా తెరకెక్కించలేదు. ఎన్నో కష్టనష్టాలను పడ్డాము. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు నన్ను ఒక్కటే అడిగారు, ‘ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్?’ అని అడిగాడు. అప్పుడు నేను 50 ఏళ్ళుగా కన్నప్ప చిత్రాన్ని తెలుగు తెరపై ఎవ్వరూ తీసుకొని రాలేదు. ఈ తరానికి ఆయన గొప్పదనం తెలియాలి అనే తపనతోనే ఈ చిత్రాన్ని తీశానని చెప్పాను’ అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
