Visakhapatnam Politics: సాధారణంగా వారసత్వం అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. సినీ, రాజకీయ రంగాల్లో( Political career ) మరీ అధికం. సినీ రంగంలో చాలా మంది వారసులను బరిలో దించుతుంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. రాజకీయాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. చాలామంది నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తెస్తుంటారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా నుంచి అధికంగా వారసులు తెరపైకి వస్తున్నారు. తమ తండ్రులు ఎమ్మెల్యేలుగా ఉండడంతో.. వారి స్థానాల్లో ఇప్పుడు అన్ని చక్కబెడుతున్నారు. ప్రజల మధ్యకు వస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కుమారులు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. అయితే ప్రత్యర్థులు వీరిపై షాడో ఎమ్మెల్యే ముద్ర వేస్తున్నారు.
Also Read: వివేకానంద రెడ్డి వర్ధంతి.. షాక్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు!
* విశాఖది ప్రత్యేక స్థానం..
రాజకీయంగా విశాఖకు( Visakha district ) ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్ర చాటేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సిటీ తో పాటు అనకాపల్లి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది కూటమి. అయితే వచ్చి ఎన్నికల నాటికి చాలామంది తమ వారసులను బరిలో దించాలని చూస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వీరంతా లోకేష్ టీమ్ గా తయారవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా మారాలని భావిస్తున్నారు.
* గంటా రవితేజ ఎంట్రీ
ఈసారి భీమిలి ( bhimili constitution )నుంచి టిడిపి అభ్యర్థిగా గెలిచారు గంటా శ్రీనివాసరావు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు రవితేజతో పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇప్పటికే రవితేజ భీమిలి నియోజకవర్గం లో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. విశాఖ తూర్పు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచారు వెలగపూడి రామకృష్ణబాబు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ప్రతాప్ ను బరిలోదించాలని చూస్తున్నారు. ప్రతాప్ సైతం నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
* విష్ణుకుమార్ రాజు కుమార్తె సైతం
విశాఖ పశ్చిమ( Visakha West ) నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు గణబాబు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు మౌర్య పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో గణబాబు కుటుంబానికి గట్టి పట్టు ఉంది. అందుకే వారసుడి రంగంలోకి దించి రాజకీయ పునాది వేయాలని గణబాబు భావిస్తున్నారు. ఇంకోవైపు బిజెపి ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన కుమార్తె దీపికను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. మొత్తానికైతే విశాఖలో వారసులు ముందు నుంచే సన్నాహాలు ప్రారంభించడం విశేషం.
Also Read: వాస్తవాలు తెలుసుకో జగన్.. విజయసాయిరెడ్డి కర్తవ్య బోధ