Reels On Railway Platform: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆన్లైన్ లోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆన్లైన్ ద్వారా ఉపాధిని పొందుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో డిఫరెంట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ వివిధ రకాలుగా ఆదాయాన్ని ఆశిస్తున్నారు. వీటిలో Reels కు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా.. డిఫరెంట్ వీడియోలు తయారు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. పాటలకు నృత్యాలు చేస్తూ.. కామెడీలు చేస్తూ.. ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ రీల్స్ ఇటీవల శ్రుతిమించుతున్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాల్లో కూడా రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా జనసేనలో డాన్సులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలా యువతి రైల్వేస్టేషన్లో రీల్ చేయడంతో కొందరికి కోపం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కదులుతున్న రైలు ముందు నిలబడి రీల్స్ చేసిన వారు చాలామంది ఉన్నారు. అలాగే కొందరు కదులుతున్న రైలు ఎక్కి వీడియోలో తీసి అప్లోడ్ చేసిన వారు ఉన్నారు. అయితే ఈ మధ్య యువతులు సైతం రైల్వే స్టేషన్లలో రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ యువతి రైల్వే స్టేషన్లో వీడియో తీస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తనని వారించాడు. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రైల్వే స్టేషన్లో రైలు ఆగగానే ఆ యువతీ కిందికి దిగి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే అప్పటికే ఆ యువతి వెనుక ఉన్న ఇద్దరిలో ఒకరు వచ్చి యువతని పక్కకు నెట్టారు. ఇది రైల్వే స్టేషన్ అంటూ.. ఇక్కడ రీల్ చేయవద్దని చెప్పాడు.
అయితే ఆ యువతి వ్యక్తిపై తిరగబడింది. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మీ ప్రదేశం రీల్ చేయడానికి అనువైనది కాదని, వేరే చోట చేసుకోవాలని సూచించాడు. అయినా ఆ యువతీ వినలేదు. దీంతో కొంతమంది అక్కడ జమ అయ్యారు. అయితే ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి.
కొందరు వీల్స్ పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటుంటే.. మరికొందరు మాత్రం రిలీజ్ చేస్తే తప్పేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే రీల్ చేయడం తప్పు కాదని జనసంచారంలో చేయడం వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుందని మరికొందరు చెప్పారు. గతంలో రైల్వే స్టేషన్లో ప్రమాదకరమైన రీల్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ప్రమాదాలు జరగవద్దని వారించామని సదరు వ్యక్తి తెలిపాడు. ఎవరూ లేని చోట Reel చేసుకోవాలని, జన సంచారంలో చేయడం వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. అయితే ఈ వివాదంతో రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
మరోవైపు సోషల్ మీడియాలో బహిరంగ ప్రదేశాల్లో రిల్స్ చేయడం తప్పు అంటూ చర్చ పెడుతున్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో రీల్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. అయితే దీనిపై రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Kalesh b/w Uncle and a girl over making reel on railway platform. pic.twitter.com/rz7G9m3F4O
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 13, 2025