Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam Navy Fest 2026: 70 నౌకలతో రె'ఢీ'.. విశాఖలో స్టార్ట్.. అసలు ఏంటి ఈ...

Visakhapatnam Navy Fest 2026: 70 నౌకలతో రె’ఢీ’.. విశాఖలో స్టార్ట్.. అసలు ఏంటి ఈ ఐఎఫ్ఆర్?!*

Visakhapatnam Navy Fest 2026: విశాఖపట్నం( Visakhapatnam) అంతర్జాతీయ వేడుకకు సిద్ధమయింది. భారత నౌకాదళం అరుదుగా నిర్వహించే అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు ముస్తాబయింది. దేశంలో ఇప్పటివరకు రెండు సార్లు ఐ ఎఫ్ ఆర్ నిర్వహించగా.. 2001లో తొలుత ముంబైలో జరిగింది. 2016లో విశాఖలో నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు దశాబ్ద కాలం తర్వాత నిర్వహిస్తుండడం విశేషం. ఈ ఉత్సవానికి 50 దేశాల నుంచి 4,000 మంది అతిథులు, 70కి పైగా యుద్ద నౌకలు వస్తుండడం విశేషం. అయితే కేవలం ఐ ఎఫ్ ఆర్ మాత్రమే కాదు. మిలన్ పేరిట నిర్వహించే మల్టీ లేటరల్ నావెల్ ఎక్సర్సైజెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది విశాఖలో.

* రాష్ట్రపతి రాక..
అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Indian President Draupadi murmu ) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇప్పటికే ఆమె విశాఖ నగరానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఒకవైపు ఐఆర్ఎఫ్, మరోవైపు మిలాన్ సాగరనగరంలో సందడి నెలకొంది. మరోవైపు ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనుంది. హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాలన్నీ ఈ సదస్సులో పాల్గొనున్నాయి. ఈనెల 15 నుంచి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 25 వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం విశాఖ నగరం ధవళ వస్త్రధారులతో దగదగా మెరిసిపోతోంది.

* కనీసం ఒక్కసారి నిబంధన..
భారత రాష్ట్రపతి తన పదవీకాలంలో కనీసం ఒక్కసారి నౌకాదళ సమీక్ష చేయాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ ఫ్లిప్ రివ్యూగా వ్యహరిస్తారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు ప్రదర్శించడం దీని ప్రత్యేకత. మరోమాటుగా చెప్పాలంటే ప్రపంచానికి ఈ సమీక్ష ద్వారా సత్తా చూపుతారు. మిత్ర దేశాలను ఆహ్వానించడం.. వారి యుద్ధనౌకలతో కలిసి విన్యాసాలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయంగా ఇతర దేశాలను భాగస్వామ్యం కల్పించడం ద్వారా… ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ గా దీనిని అభివర్ణిస్తారు.

* అండమాన్ నుంచి మిలాన్..
ఇక మిలాన్( Milan) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 1995లో దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడ నుంచి క్రమం తప్పకుండా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ వచ్చారు. దీనికి ఎక్కువసార్లు అండమాన్ వేదిక కావడం గమనార్హం. 2014లో అత్యధికంగా 17 దేశాలు పాల్గొన్నాయి. అయితే అండమాన్ లో సరిపడా వసతులు లేకపోవడంతో విశాఖకు వేదికగా మార్చారు. 2020లో కరోనా ప్రభావంతో మిలన్ వాయిదా పడింది. 2022లో.. 2024 లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విశాఖ వేదికగా ఈ వేడుక జరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య మైత్రి, స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకుగాను ఈ మిలాన్ నిర్వహిస్తుంటారు. మొత్తానికైతే సాగరనగరం మణికాంతులతో మెరిసిపోతోంది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version