దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రాష్ట్రాలకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రులకు, ఎంపీలకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇస్తుంటాయి. ఇక ఆహారం, పేదరికం, ధనిక రాష్ట్రలపైనా ర్యాంకులు ప్రకటిస్తుంటాయి. తాజాగా 2024–25 సంవత్సరానికి సబంధించిన ఆర్థిక నివేదిక ప్రకారం.. దేశంలో పది ధనిక నగరాల జాబితా విడుదలైంది.
ముంబై నంబర్ వన్..
దేశ ఆర్థిక రాజధాని ముంబై సంపన్న నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. రూ. 27.80 లక్షల కోట్ల జీడీపీతో బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, బాలీవుడ్, ఓడరేవు వ్యాపారం ద్వారా ఆధిపత్యం వహిస్తోంది.
ఢిల్లీ రెండో స్థానం..
దేశ రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం అయిన ఢిల్లీ సంపన్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. రూ. 24.37 లక్షల కోట్ల జీడీపీతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. కార్పొరేట్ కార్యాలయాలు, పరిపాలనా కేంద్రాలు ఇందుకు తోడ్పడుతున్నాయి.
మూడోస్థానంలో కోల్‌కతా..
ఇక కోల్‌కతా నగరం.. సంపన్న నగరాల జాబితలో మూడో స్థానంలో నిలిచింది. దీని రూ.13,45 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో చారిత్రక ఓడరేవు నగరం, ఉక్కు, ఇంజినీరింగ్, టీ వ్యాపారం, తయారీ రంగాలలో అగ్రగామిగా ఉంది.
బెంగలూరు..
ఐటీ రాజధాని బెంగళూరు.. సంపన్న నగరాల్లో నాలుగో స్థానంలో ఉంది. బెంగళూరును భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. దాదాపు రూ.9.86 లక్షల కోట్ల జీడీపీతో ఈ నగరం ఐటీ, స్టార్టప్ రంగాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనేక యునికార్న్ కంపెనీలు ఇక్కడి నుండే ప్రారంభమయ్యాయి.
ఐదో ర్యాంకులో చెన్నై..
దక్షిణ భారత దేశానికి చెందిన చెన్నై నగరం ఐదో స్థానంలో (రూ. 7.05 లక్షల కోట్లు)లో నిలిచింది.
ఆరో స్థానంలో హైదరాబాద్..
ఇక తెలంగాణ రాజధాని, ఐటీ ఎగుమతులలో దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ సంపన్న నగరాల జాబితాలో ఆరోస్థానంలో నిలిచింది. సంపదర రూ. 6.70 లక్షల కోట్లుగా ఉంది.
పూణే ఏడవ స్థానంలో..
మహారాష్ట్రలో ముంబై తర్వాత మరో ప్రధాన నగరం పూణె. రూ. 6.18 లక్షల కోట్లు సంపదతో పూనే సంపన్న నగరాల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.
అహ్మదాబాద్ ఎనిమిదో స్థానం..
గుజరాత్‌కు చెందిన అహ్మదాబాద్ నగరం దేశంలో 8వ ర్యాంకు సాధించింది. ఇక్కడి సంపద రూ. 6.09 లక్షల కోట్లు.
సూరత్ తొమ్మిదవ స్థానం..
ఇక గుజరాత్‌కు చెందిన సూరత్ సంపన్న నగరాల జాబితాలో 9వ స్థానం సాధించింది. ఇక్కడ సంపద రూ. 5.30 లక్షల కోట్లు.
పదో స్థానంలో పోర్టు సిటీ..
ఆంధ్రప్రదేశ్ పోర్టు సిటీగా గుర్తింపు ఉన్న విశాఖపట్నం దేశంలోని టాప్‌టెన్ సంపన్న నగరాల జాబితాలో స్థానం సంపాదించింది. రూ.3.90 లక్షల కోట్ల సంపదతో పదో స్థానంలో నిలిచింది. పారిశ్రామిక, ఐటీ, వస్త్ర, ఫార్మా, ఎగుమతి రంగాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నాయి.