Homeఆంధ్రప్రదేశ్‌Minister Nara Lokesh: దేశవ్యాప్తంగా లోకేష్ ప్రతిపాదనపై చర్చ!

Minister Nara Lokesh: దేశవ్యాప్తంగా లోకేష్ ప్రతిపాదనపై చర్చ!

Minister Nara Lokesh: సోషల్ మీడియా( social media) దుష్ప్రభావం అంతా ఇంతా కాదు. దానిని వినియోగించుకునే క్రమంలో.. దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలన్న ఆలోచన చేస్తోంది కూటమి ప్రభుత్వం. ముందుగా ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రస్తావించారు. అయితే తాజాగా ఈ ఆలోచనకు కేంద్రం సైతం స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడంతో దీనిపై లోతైన చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. టీనేజ్ లో ఉన్న వారిపై సోషల్ మీడియా ప్రభావం పడకుండా ఉండేందుకు.. కేంద్ర ప్రభుత్వం వయస్సు ఆధారిత పరిమితులను విధించాలని ఆలోచన చేస్తోంది.

* చాలా సీరియస్ అంశంగా..
మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) విదేశీ పర్యటన సమయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియా కు ప్రభావితం అవుతున్న పిల్లలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. త్వరలో ఏపీలో చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులో ఒక బిల్లు పెట్టారు. దీనిపై ఇప్పుడు లోతైన చర్చ నడుస్తోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మనదేశంలో కూడా ఆ దిశగా సోషల్ మీడియా కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఇది ప్రతిపాదన స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం సైతం విస్తృత సంప్రదింపులు చేసి దీనికి ఒక తుది రూపు తేవాలన్న ఆలోచనతో ఉంది. వయస్సు ఆధారిత నియంత్రణను ఎలా అమలు చేయాలి అనే దానిపై నిపుణులతో చర్చిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

* ఆ ప్రతిపాదనతోనే..
అయితే లోకేష్ నుంచి ఈ ప్రతిపాదన కేంద్రానికి వెళ్లడం శుభ పరిణామం. మొన్న మధ్యన లోకేష్ టిడిపి పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యారు. అక్కడే సోషల్ మీడియా వినియోగంపై పార్టీ ఎంపీలతో చర్చించారు. అటు తరువాత టిడిపి పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే చర్చకు కారణం అవుతోంది. ముఖ్యంగా కేంద్ర పెద్దలు ఏపీ మంత్రి నారా లోకేష్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version