Visakhapatnam Andala Viharam : ఏపీలో అందమైన సిటీ విశాఖపట్నం( Visakhapatnam). చెంతనే సువిశాలమైన సముద్రం, చుట్టూ కొండలు, ప్రకృతి పరవళ్ళు.. ఇలా ఒకటేమిటి.. పర్యాటక సమాహారం విశాఖపట్నం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో పర్యాటక శాఖ పరంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. విశాఖ తీర ప్రాంతం తో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించే వీలుగా డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనున్నారు. అద్భుత ప్రయాణానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. విదేశాల మాదిరిగానే పర్యాటకులు విహరించేందుకు అందమైన డబుల్ డెక్కర్ బస్సులు విశాఖలో అందుబాటులోకి రానున్నాయి. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. రవాణాకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
* వీటి ప్రత్యేకత అదే..
పర్యాటక ప్రాంతాల్లో తిరిగే డబుల్ డెక్కర్( double decker) బస్సులను ‘హాప్ ఆన్ హాప్ ఆఫ్’ బస్సులు అంటారు. వీటికి ప్రత్యేకత ఉంది. పర్యాటకులు తాము చూడాలనుకున్న ప్రదేశం లో దిగి, ఎంతసేపు చూసిన తర్వాత అయినా, మళ్లీ అదే రూట్ లో వచ్చే మరో బస్సు ఎక్కి తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఈ బస్సులు రుషికొండ, సింహాచలం వంటి ప్రదేశాలకు దగ్గరగా ఉన్నందున అక్కడ ఆగుతాయి. ఆర్కే బీచ్, తొట్ల కొండ, రుషికొండ, సింహాచలం, భీమిలి బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. కేవలం పర్యాటకుల కోసం మాత్రమే ఈ బస్సులు తిరగనున్నాయి.
* నిత్యం పర్యాటకుల తాకిడి..
విశాఖ నగరం అంటేనే పర్యాటక ప్రాంతం. ప్రపంచ పటంలో సైతం విశాఖకు ప్రత్యేక స్థానం ఉంది. సువిశాలమైన సాగర తీరం ఈ నగరం సొంతం. ఆపై పర్యాటక ప్రాంతాలు ( tourism places)చాలా వరకు ఉన్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న ఒడిస్సా, చత్తీస్గడ్ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఎక్కువగా విశాఖ నగరానికి వస్తుంటారు. పర్యాటక ఆనవాళ్లుగా రుషికొండ బీచ్ ఉంది. అయితే దశాబ్దాల చరిత్ర కలిగిన రుషికొండను వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. భారీ భవనాలను నిర్మించింది. ఇప్పుడు వాటిని ఎలా వినియోగించుకోవాలో కూటమి ప్రభుత్వానికి తెలియడం లేదు. అయితే ఈ వివాదాన్ని పక్కన పెడుతూనే పర్యాటకంగా విశాఖను మరింత అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : సాగరనగరం పై నిఘా.. పోలీసుల జల్లెడ!
* మన్య ప్రాంతంలో సైతం..
ఇప్పటికే విశాఖ మన్య ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం( allians government ). అక్కడ పర్యాటకులు గాల్లో విహరించేలా హెలికాప్టర్లను సైతం అందుబాటులోకి తేనున్నారు. పెద్ద ఎత్తున హెలిపాడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంకోవైపు విశాఖ నగరం తో పాటు మన్య ప్రాంతంలో పర్యాటకుల కోసం స్టే హోమ్ సదుపాయాన్ని కూడా ఆన్లైన్లో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతాలను విహరించేందుకుగాను.. బస్సు పై ఉండి చూసేందుకుగాను డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. దీనిపై పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.