Harish Rao Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని హరీశ్ రావు. కాశేశ్వరం ప్రాజెక్టు పై ఆయన తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తంగా ప్రాజెక్టు ద్వారా 20. 33 లక్షల ఎకరాలకు నీరు అందించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామని, ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఒప్పించామన్నారు.