PM Modi AP Tour: ప్రధాని మోదీ విశాఖపట్నం( Visakhapatnam) పర్యటనకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కొద్ది గంటల్లో విశాఖలో అడుగుపెట్టనున్నారు ప్రధాని మోదీ. దాదాపు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి మోడీ శంకుస్థాపన చేస్తారు. ముందుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రోడ్ షోలో( Roadshow ) పాల్గొంటారు మోడీ. అనంతరం బహిరంగ సభ లో మాట్లాడతారు. అయితే ప్రధాని మోదీ ప్రసంగం పైనే అందరి ఆసక్తి ఉంది. ఏపీకి భారీగా వరాలు ప్రకటిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తమది డబుల్ ఇంజన్ సర్కార్( double engine government) అంటూ ఏపీ విషయంలో ఎన్నో ఆశలు కల్పించారు మోడీ. కాగా తన పర్యటన నేపథ్యంలో కీలక ట్వీట్ చేశారు. అది కూడా తెలుగులోనే కావడం విశేషం. విశాఖలో పర్యటించేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. తనకు ఎంతో ఆనందంగా ఉందని కూడా చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు నిరీక్షిస్తున్నామని చెప్పారు.
* భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధాని మోదీ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ( AU Engineering College Ground )ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వర్చువల్ విధానంలోనే రెండు లక్షల రూపాయలతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నారు. 1,85 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టుకు ముందుగా శంకుస్థాపన చేస్తారు. మరో 10 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడమే కాకుండా జాతికి అంకితం చేస్తారు. అయితే ఇదే వేదికపై ఏపీకి కీలక వరాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. కూటమి పార్టీల నేతలు కూడా దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు.
* ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్
ప్రధానంగా ఉత్తరాంధ్ర( Uttar Andhra) అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల మంజూరు విషయంలో కూడా స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో సైతం స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant) ప్రైవేటీకరణ విషయంలో రకరకాల ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఇక్కడ కార్మికులు ఉద్యమ బాట పట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ లో విలీనం చేశారు. విశాఖ స్టీల్ ఉత్పత్తి పెంచే వీలుగా అత్యాధునిక పరికరాలు, యంత్రాలు సమకూర్చేందుకు కేంద్రం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటికి బదులు ఆర్థిక సాయం ( special grant)ప్రకటించి ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. దీనిపై కూడా ప్రధాని మోదీ ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అంశంపైనే అందరి ఆశలు పెట్టుకున్నారు.
* పరస్పర ఉమ్మడి ప్రభుత్వాలు
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్డీఏలో కీలక భాగస్వామి. బిజెపి టిడిపి కూటమిలో ఉంది. పరస్పర ఉమ్మడి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సైతం కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను బిజెపి వినియోగించుకుంటుంది. ఈ తరుణంలో ఏపీలో కూడా రాజకీయంగా బలపడాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. అందుకు కేంద్ర సాయాన్ని కోరుతూ వస్తున్నారు చంద్రబాబు తో పాటు పవన్. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలిసారిగా అధికారిక హోదాలో ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెడుతున్నారు. దీంతో వరాల జల్లు ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి ప్రధాని ఎలాంటి వరాలు ప్రకటిస్తారో చూడాలి.