Ram Charan : తెలుగులో ఇప్పటి వరకు చాలా సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్న చిరంజీవి…మెగాస్టార్ గా అవతరించమే కాకుండా 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలు అందిస్తున్నాడు…ఆయన కొడుకు అయిన రామ్ చరణ్ కూడా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా అందించిన విజయంతో ఆయన ఎక్కడ వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే ‘మగధీర ‘ సినిమా చేశాడో అప్పటి నుంచి ఆయన క్రేజ్ అనేది తారాస్థాయిలో పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక రంగస్థలం సినిమాతో మరోసారి తనలోని నటన ప్రతిభను బయటకు తీసిన రామ్ చరణ్ ఆ సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా ఆయనకు స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టిందనే చెప్పాలి. ఇక ఆ సినిమా సక్సెస్ తో పాన్ ఇండియాలో కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఎంటైర్ కెరియర్ లో చాలామందికి సహాయం చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన టెక్నీషియన్స్ కి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే చాలు తను ముందుండి మరి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అపోలో హాస్పటల్లో రిఫర్ చేస్తూ ఆయన చాలామందికి చాలా రకాల హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు.
ఇక ఏది ఏమైనా కూడా జానీ మాస్టర్ లాంటి ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ కి సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చిందే కాక, ఆయన కుటుంబానికి కూడా ఆయన ఎప్పుడు ఆసరాగా నిలుస్తున్నాడు. తన కొడుకు పుట్టినప్పుడు జని మాస్టర్ భారత ను హాస్పిటల్ కి తీసుకెళ్ళే డబ్బులు లేకపోవడం తో రామ్ చరణ్ దగ్గరుండి అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయించాడట.
ఒక రూపాయి కూడా తీసుకోకుండా పది రోజుల పాటు అపోలో హాస్పిటల్లో విఐపి ట్రీట్మెంట్ ని అందించి జానీ మాస్టర్ ని ఆదుకున్నాడు. ఇక అతనితో పాటుగా షూటింగ్ స్పాట్లో చాలామంది టెక్నీషియన్స్ కి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే స్పాట్లోనే అక్కడ వాళ్లకు ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. రామ్ చరణ్ తో నటించిన చాలామంది నటులు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.
ఇక చిరంజీవి చాలా మందికి సేవలు చేస్తూ ఉంటాడని తెలుసు కానీ చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ కూడా ఆర్థిక సహాయాన్ని అందించడంలో గాని కొంతమందికి సపోర్టుగా నిలవడంలో కానీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన తనయుడిగా పేరు పొందుతున్నాడు అంటూ మెగా అభిమానులు రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు…