Daku Maharaj : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూ మంచి సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలుగా చేసి సూపర్ సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు…
బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించారు అనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఇంతకుముందు చేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయితే వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు… ఇక ఇప్పటివరకు అభిమానులు కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచిందనే చెప్పాలి… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా మీద ఇప్పటికే నెగెటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది కావాలని ‘డాకు మహారాజ్’ సినిమా మీద నెగెటివ్ ప్రచారం చేస్తూ ఈ సినిమాలో మ్యాటర్ ఏమీ ఉండదు అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
మరి ఇలాంటి కామెంట్లు ఎవరు చేస్తున్నారనే దానిమీద కొంత వరకు సమాచారం అయితే అందుతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కావాలని బాలయ్య బాబును టార్గెట్ చేసి ఇలాంటివి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే ‘డాకు మహారాజ్’ మూవీ టీమ్ అన్ స్టాపబుల్ షో కి వచ్చినప్పుడు ఇంతకు ముందు బాబీ డైరెక్షన్ లో చేసిన హీరోలందరి ఫోటోలు వేసి ఎన్టీఆర్ ఫోటో మాత్రం వేయలేదు. దానికి కారణం బాలయ్య బాబు అంటూ ఎన్టీయార్ అభిమానులు బాలయ్య మీద కొంతవరకు కోపంతో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. దాని వల్లే ఈ సినిమా మీద నెగెటివ్ ప్రచారం అయితే చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఈ సినిమా సక్సెస్ అయితే బాబి నెక్స్ట్ సినిమాని మరొక స్టార్ హీరోతో చేయబోయే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ పొరపాటున తేడా కొడితే మాత్రం మరోసారి సీనియర్ హీరోనే డైరెక్ట్ చేయాల్సిన అవకాశం అయితే రావచ్చు…