Viral Video : మన వీర జవాన్లు మన దేశానికీ వెలకట్టలేని సంపద. ఎలాంటి లాభాలను ఆశించకుండా దేశం కోసం పోరాడి చనిపోయే అదృష్టం ఎంత మందికి వస్తుంది చెప్పండి. వాళ్ళు చనిపోయారు అనే బాధ ఒక పక్క ఉన్నప్పటికీ, ఇలాంటి చావు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ రాదు అనే ఫీలింగ్ కూడా మనలో కలుగుతుంది. రీసెంట్ గా పెహల్గామ్(Pahalgam) దాడి తర్వాత చోటు చేసుకున్న ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindhoor) లో భాగంగా మన ఆంధ్ర ప్రదేశ్ లో సత్య సాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే 23 ఏళ్ళ కుర్రాడు, యుద్ధంలో పోరాడు కాల్పుల్లో చనిపోయిన ఘటన యావత్తు భారత దేశాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. టీనేజ్ లో తన తోటి మిత్రులతో కలిసి సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన దేశానికి సేవ చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపించాడు.
Also Read : వల్లభనేేని వంశీ కి మళ్లీ షాక్.. ఇక జైలు నుంచి బయటకు కష్టమే
మురళీ నాయక్(Murali Nayak) దేశం కోసం చేసిన ప్రాణ త్యాగానికి గౌరవమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), హోమ్ మినిస్టర్ అనిత వంటి వారు మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళి అర్పించి, జోహార్ మురళీ నాయక్ అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ అయితే మురళీ నాయక్ పాడెని కూడా మోశాడు. ప్రభుత్వం తరుపున 50 లక్షల రూపాయిల నగదు, 5 ఎకరాల భూమి, మూడు గజాలు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ప్రభుత్వం తరుపున ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పాతిక లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని అందించాడు. రీసెంట్ గానే విపక్ష నేత జగన్ కూడా మురళీ నాయక్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించాడు. వైసీపీ పార్టీ తరుపున పాతిక లక్షల రూపాయిల విరాళం కూడా ప్రకటించాడు.
ఇదంతా పక్కన పెడితే మిమిక్రీ ఆర్టిస్ట్ గా, సినీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న శివా రెడ్డి(Siva Reddy) నేడు మురళీ నాయక్ ఇంటికి వెళ్ళాడు. అతని వీరమరణం పట్ల కన్నీటి నివాళి అర్పించి మురళీ నాయక్ తల్లికి పాదాభివండం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కూడా మనం స్వేచ్ఛగా ,ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నామంటే మురళీ నాయక్ లాంటి జావాన్లు కారణమని, అలాంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ తల్లికి పాదాభివందనం అంటూ శివా రెడ్డి ఎమోషనల్ గా కామెంట్స్ చేశాడు. శివా రెడ్డి ప్రస్తుతం సినిమాల్లో యాక్టీవ్ గా లేడు, రాజకీయాలకు అయితే దరిదాపుల్లో కూడా లేడు, అయినప్పటికీ మురళీ నాయక్ ఇంటిని వెట్టుకుంటూ వచ్చి అతని తల్లితండ్రులకు ధైర్యం చెప్పి వెళ్లాడంటే, ఆయన దేశభక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
