Homeఆంధ్రప్రదేశ్‌Vallabhaneni Vamsi  : వల్లభనేేని వంశీ కి మళ్లీ షాక్.. ఇక జైలు నుంచి బయటకు...

Vallabhaneni Vamsi  : వల్లభనేేని వంశీ కి మళ్లీ షాక్.. ఇక జైలు నుంచి బయటకు కష్టమే

Vallabhaneni Vamsi  : ఒకవైపు క్షీణిస్తున్న అనారోగ్యం.. మరోవైపు బెయిల్ లభించని వైనం.. ఇది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్( Vallabhaneni Vamsi Mohan) పరిస్థితి. ఆయనకు ఇప్పట్లో జైలు కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఆయనపై నమోదైన ఆరు కేసుల్లో ఐదింటికి బెయిల్ లభించింది. ఒక్క కేసులో మాత్రం పెండింగ్లో ఉంది. ఆ కేసులో సైతం బెయిల్ లభిస్తుందని అంతా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నూజివీడు పోలీసులు అనూహ్యంగా మరో కేసును తెరపైకి తెచ్చారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు లోని నకిలీ ఇళ్ల పట్టాలి ఇచ్చి.. ప్రజలను మోసం చేశారని ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. శుక్రవారం పిటి వారెంట్ పై అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది. దీంతో వల్లభనేని వంశీ మోహన్ పై మూపిన కేసులు ఏడుకు చేరుకున్నాయి.

Also Read : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!

* వంద రోజులుగా జైల్లోనే..
గన్నవరం ( Gannavaram) టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. అప్పటినుంచి ఆయనపై కేసులు నమోదు వచ్చాయి. రిమాండ్ల మీద రిమాండ్లు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇంతలో వల్లభనేని వంశీ మోహన్ పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. నిన్ననే దగ్గుతో బాధపడుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించారు. తన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ కోరుతూ వచ్చారు. అయితే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ లభించింది. కానీ టిడిపి కార్యాలయం పై దాడి కేసుకు సంబంధించి బెయిల్ రాలేదు. దానిపై వాదనలు కొనసాగుతున్నాయి. ఇంతలోనే ఇప్పుడు నకిలీ పట్టాల వివాదం తెరపైకి తెచ్చారు పోలీసులు. ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ కు రిమాండ్ విధించడంతో ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు.

* ఇంతలోనే రిమాండ్..
టిడిపి కార్యాలయం పై( Telugu Desam Party office) దాడి కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ 16న విచారణకు రానుంది. ఇంతలోనే ఇప్పుడు నూజివీడు కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వాస్తవానికి నకిలీ పట్టాల వివాదం ఇప్పటిది కాదు. అయితే పోలీసులు ఒక పద్ధతి ప్రకారం ఆయనపై కేసులు నమోదు చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఆయనకు బెయిల్ వచ్చి బయటకు వస్తుందనుకున్న తరుణంలో కొత్త కేసులను తెరపైకి తెస్తున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో న్యాయ సాయం దక్కడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంశి బెయిల్ కోసం ఆయన భార్య ఎక్కువగా కృషి చేస్తున్నారు. న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటున్నారు.

* వైసిపి నుంచి అందని సాయం..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయిన ప్రారంభంలో ఆయనను పరామర్శించారు. విజయవాడ జైలుకు వెళ్లి కలిశారు. వల్లభనేని వంశీ తో పాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయ సాయం అందడం లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వంశీ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. సుమారు 100 రోజులపాటు జైలులో ఉండడంతో వంశీ బాగా నిరసించి పోయారు. బరువు కూడా తగ్గినట్లు కనిపిస్తున్నారు. శ్వాసకోస వ్యాధులతో సతమవుతమవుతున్నారు. దీంతో ఆయన అభిమానుల్లో ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version