Homeఆంధ్రప్రదేశ్‌Viral Video : విమానం నడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

Viral Video : విమానం నడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

Viral Video : వైయస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( kethi Reddy Venkat Ram Reddy ) సరికొత్త గెటప్ లో కనిపించారు. ఈసారి ఆయన విమాన పైలట్ గా కనిపించారు. హైదరాబాద్ నగరంలో విమానం నడుపుతూ గగన తలంలో విహరించారు. అందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాలే కాదు ఇటువంటివి కూడా ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.

Also Read : అడ్డంగా బుక్కైన వైసీపీ మాజీ మంత్రి.. ఏ క్షణం అయినా అరెస్ట్!

* ప్రైవేటు జెట్ విమానం నడుపుతూ..
హైదరాబాద్ ( Hyderabad) నగరంలోని ఓ ప్రైవేటు జెట్ విమానంలో( private jet flight ) పైలెట్ గా కనిపించారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అచ్చం ట్రైనింగ్ తీసుకున్న పైలెట్ మాదిరిగా విమానాన్ని హైదరాబాద్ గగన వీధుల్లో డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు సాగారు కేతిరెడ్డి. అందుకు సంబంధించిన వీడియోలను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఏదో సరదాగా.. నేర్చుకున్నానని.. విమానాన్ని నడపడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. దీంతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నేటిజెన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ అంశంగా మారింది.

* చిన్న వయసులోనే అసెంబ్లీకి..
చిన్న వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తన తండ్రి అకాల మరణంతో 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కేతిరెడ్డి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చేరింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరెడ్డి ఓడిపోయారు. 2019లో రెండోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గెలిచిన నాటి నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.

* అనూహ్యంగా ఓటమి
వాస్తవానికి ధర్మవరం( Dharmavaram) నియోజకవర్గంలో కేతిరెడ్డి చేసిన కార్యక్రమాల దృష్ట్యా ఆయనకు ఓటమి ఉండదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా 2024 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. చివరి నిమిషంలో ధర్మవరం నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. సత్య కుమార్ యాదవ్ అభ్యర్థిగా మారారు. అయితే ఓటమిని ఊహించని కేతిరెడ్డి… ఓడిపోయేసరికి తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ప్రజలకు మంచి చేస్తే తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని వైఫల్యాలను కూడా బయటపెట్టారు. కూటమి ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే విమర్శలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఆయన జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు రిలాక్స్ గా ఆయన విమానం నడుపుతూ కనిపించడం మాత్రం ఆకట్టుకుంటుంది.

Also Read : పాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో.. కీలకంగా మారినవివే!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular