Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy : విజయసాయిరెడ్డి యూ టర్న్.. జూన్ లో స్ట్రాంగ్ డెసిషన్.. చంద్రబాబు మాస్టర్...

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి యూ టర్న్.. జూన్ లో స్ట్రాంగ్ డెసిషన్.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్!

Vijayasai Reddy : రాజకీయాల్లో ( politics) ఏదైనా సాధ్యమే. అవసరాలు ఎంత పని అయినా చేయిస్తాయి. ఇది సహజ చర్య కూడా. ఈ నేపథ్యంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి పై సరికొత్త ప్రచారం ప్రారంభం అయింది. ఆయన బిజెపిలో చేరతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడిన వెంటనే విజయసాయిరెడ్డికి బిజెపి నుంచి ఆహ్వానం అందిందట. అయితే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు అన్న విమర్శ ఎదురవుతుందని భావించి.. విజయసాయిరెడ్డి కొన్ని రోజులపాటు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : పవన్ ను తిడితే ఎలా.. నష్టమని తెలిసినా ఎందుకలా జగన్!

* పార్టీకి గట్టి నేత..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేవారు. ఆ పార్టీకి ఒక మూలస్తంభంగా నిలిచారు. కనీసం ఆయన పార్టీ మారుతారని ఎన్నడూ అనుకోలేదు. ఆ ఆలోచన కూడా ఎవరు చేయలేదు. కనీసం ఊహకు కూడా అందలేదు. అటువంటి నేత పార్టీ మారడం వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఆయన కేవలం రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం వెనుక.. అంత నమ్మశక్యం కాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రవర్తన కూడా ఉంది.

* కేంద్ర పెద్దలతో సన్నిహితం..
కేంద్ర పెద్దలతో విజయసాయి రెడ్డికి ( Vijaya Sai Reddy ) మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ పేరు పెట్టి పిలిచే అంత చనువు ఉంది. అమిత్ షా కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేవారు. అంతటి చతురత విజయసాయి రెడ్డికి ఉంది. ఆయన తప్పకుండా బిజెపికి చేరువయ్యే అవకాశం కనిపించింది. కానీ ఎందుకో రాజకీయ నిష్క్రమణ ప్రకటన చేశారు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా విజయసాయిరెడ్డి అడుగులు వేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా జూన్లో ఆయన బిజెపిలో చేరతారని తెగ ప్రచారం నడుస్తోంది. అప్పటివరకు బిజెపి పెద్దలకు అనుగుణంగా పనిచేస్తారని తెలుస్తోంది.

* వైయస్సార్ కాంగ్రెస్ నిర్వీర్యం..
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ( Chandrababu) మాస్టర్ ప్లాన్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకు బిజెపి పెద్దలను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. కేంద్ర పెద్దల ఆదేశాలు లేనిదే విజయసాయిరెడ్డి రాజీనామా చేయరు. పైగా రాజీనామా చేసినప్పుడు ప్రధాని మోదీ తో పాటు అమిత్ షాకు థాంక్స్ చెప్పారు. అంటే ప్రత్యేక విజన్ తోనే విజయసాయి రెడ్డి రాజీనామా అని స్పష్టం అయింది. అయితే జూన్లో విజయసాయిరెడ్డి చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలి.

Also Read :

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version