Homeఆంధ్రప్రదేశ్‌Prashna Ravan : 'ప్రశ్న రావణ్' కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రకాష్ రాజ్.. సంచలనం...

Prashna Ravan : ‘ప్రశ్న రావణ్’ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రకాష్ రాజ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ వీడియో..

Prashna Ravan : గత 10 రోజుల నుండి సోషల్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా లో ‘ప్రశ్న రావణ్’ పేరు ఏ రేంజ్ లో మారుమోగిపోతుందో చూస్తూనే ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పీకలదాకా నిండిన ద్వేషం తో , ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడడమే కాకుండా, హిందూ దేవుళ్లను దూషించడం, టెర్రరిస్టులకు , నక్సలైట్లకు సపోర్టుగా వీడియోలు చేయడం వంటివి చేసిన ఇతన్ని పోలీసులు UAPA చట్టం క్రింద కేసులు నమోదు చేశారు. ఇతన్ని అరెస్ట్ చేయడాన్ని అందరూ సామర్దించారు, ఒక్క వైసీపీ పార్టీ శ్రేణులు , యాంటీ నేషనలిస్ట్ భావాలు గల ప్రకాష్ రాజ్ వంటి వారు తప్ప. అయితే నెల్లూరు జైలు లో రిమాండ్ లో ఉన్నటువంటి రావణ్ మొబైల్ ని పరిశీలించిన పోలీసులకు కొన్ని సంచలన నిజాలు తెలిసాయి , రావణ్ అకృత్యాలు , మోసాలు అన్నీ బయటపడ్డాయి.

దీంతో అతనికి సపోర్టు చేసిన వారు ఒక్కొక్కరిగా జారుకున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు అయితే కొందరు రావణ్ లాంటోళ్లని మేమెందుకు చేరదీస్తామని తప్పుకునే ప్రయత్నం చేయగా, అంబటి రాంబాబు వంటి వారు రావణ్ కి వైసీపీ పార్టీ న్యాయ సహాయం చేస్తామని మాట ఇచ్చారు. మాట ఇవ్వడమే కాదు , న్యాయ సహాయం కూడా చేస్తున్నారు. దీంతో మొదటి నాలుగు కేసుల్లో రావణ్ కి బెయిల్ ఇప్పించిన జడ శ్రవణ్ వంటి వారు కూడా ఈ కేసు నుండి తెలివిగా తప్పుకున్నారు. ప్రకాష్ రాజ్ కూడా సైలెంట్ అవ్వడం తో , అతనికి నిజాలు తెలిసి సైలెంట్ అయిపోయారని , ఇప్పటికైనా బుద్దితెచ్చుకున్నారని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే కాసేపటి క్రితమే ప్రకాష్ రాజ్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియో లో ఆయన ఇప్పటికీ రావణ్ తప్పు చేసినట్టుగా ఒప్పుకోవడం లేదు .

అతని కోసం అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రకాష్ రాజ్. ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది నేను సైలెంట్ అయిపోయానని అంటున్నారు. నేనేమి సైలెంట్ అవ్వలేదు , మొత్తం చూస్తూ ఉన్నాను, మీరు ఎంత దిగజారిపోతున్నారో గమనిస్తూ ఉన్నాను. అసత్య ప్రచారాలతో నేరుగా ఎమ్మెల్యేలు , ఎంపీలు రంగం లోకి దిగడం, యూట్యూబర్లు , జనసైనికులు, కొన్ని అమ్ముడుపోయిన మీడియా చానెల్స్ చేస్తున్న ప్రచారాలను గమనిస్తున్నాను. వీటి అన్నిటికీ ఒక్కటే సమాధానం చెప్తున్నాను. దిగజారండి , ఇంకా ఇంకా దిగజారుతూనే ఉండండి, మీరు ఎంత దిగజారిన ప్రపంచం మొత్తం మిమ్మల్ని గమనిస్తూనే ఉంది, మీరు ఏమి చేసిన ప్రశ్నించే గొంతుకని ఆపలేరు’ అంటూ ఒక వీడియో ని విడుదల చేసాడు ప్రకాష్ రాజ్. దీనిపై నెటిజెన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version