Prashna Ravan : ప్రధాన మీడియా పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియా ఊరుకోదు కదా.. లోతుగా తవ్వింది.. అసలు ఏం జరిగింది అని తెలుసుకుంది. చివరికి ప్రశ్న వెనుక ఉన్న అసలు ముసుగును బయటపెట్టింది. తద్వారా నిజం తెలిసింది. ఇంతకీ ఏం జరిగింది.. ఏపీలో ఈ పరిణామం దేనికి దారి తీయ పోతోంది..
ఉపా చట్టం కింద బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్నాడు. వాస్తవానికి రావణ్ ఒక్కడే కాదని.. అతను ఒక్కడు ఇదంతా చేయలేదని.. తెర వెనుక చాలా కథ ఉందని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. రావణ్ వెనుక ఉన్న అసలు కథను తవ్వితీయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక మహిళ పేరు తెర మీదికి వచ్చింది. ఆమె పేరు గమన..
ఇటీవల వైసిపి అధినేత జగన్ విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో కి వచ్చినప్పుడు గమన ఆయనను కలిసింది. అప్పుడు జగన్ ఆమె నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. కచ్చితంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దానికి గమన ఉప్పొంగిపోయింది.. ధన్యోస్మి అన్న లెవెల్లో హవ భావాలు ప్రదర్శించింది. జగన్ ను కలిసిన తర్వాత గమన ఎవరు అనే చర్చ మొదలైంది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టడంతో గమనకు సంబంధించిన అసలు విషయాలు బయటపడుతున్నాయి.
ప్రశ్న యూట్యూబ్ ఛానల్ కు సీఈవోగా గమన వ్యవహరిస్తోంది. ఈ ఛానల్ కు సంబంధించిన ఫండింగ్ మొత్తం గమన సమకూర్చుతోంది. రావణ్ తో ఆమె అత్యంత సన్నిహితంగా ఉండేది. అతడితో కలిసి రీల్స్.. కాంట్రవర్షల్ పొలిటికల్ వీడియోలు కూడా రూపొందించేది. వైసిపికి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా నెట్వర్క్ లో ఈమె తెరవెనుక అత్యంత కీలకపాత్ర పోషించిందని తెలుస్తోంది.
ప్రశ్న యూట్యూబ్ స్టూడియో.. ఇతర కార్యకలాపాలకు సంబంధించిన రాజకీయ లింకులు మొత్తం విచారణలో బయటపడుతున్నాయి.. వైసీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గం మాదినేని ఉమామహేశ్వర నాయుడు సోదరుడికి సంబంధించిన ఒక ప్లాట్ లో ఈ ఛానల్ స్టూడియో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాంట్రవర్షల్ కంటెంట్.. ఇతర ప్రొడక్షన్ మొత్తం కూడా అక్కడి నుంచే కొనసాగుతోందని సమాచారం. అయితే దీని వెనుక అతిపెద్ద రాజకీయ కుట్ర కోణం ఉందని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కీలకమైన డేటా మొత్తం స్వీకరించారు. ప్రస్తుతం ఈ కేసు తీవ్రమైన రూపు దాల్చడంతో.. పోలీసులు గమనికు అధికారికంగానే నోటీసులు ఇచ్చారు. రావణ్ మొబైల్ ఫోన్.. లాప్టాప్ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలకమైన సమాచారాన్ని.. వీడియోలను పోలీసులు రికవరీ చేశారు.. ప్రశ్న బృందానికి ఇంతటి తెగింపు ఎక్కడిది.. వీరి వెనుక ఎవరున్నారు.. డబ్బులు ఎవరిస్తున్నారు.. అనే అంశాలను పోలీసులు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
