Vidadala Rajini : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ కూడా జరిగింది. ఇంకోవైపు రేపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు విచారించనున్నారు. ఇటువంటి తరుణంలో మాజీమంత్రి విడదల రజిని పేరు తెరపైకి వచ్చింది. వైసిపి హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పైన కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజని ఓ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రజిని పైన విచారణ కోసం ఏసీబీ తాజాగా గవర్నర్ కు లేఖ రాసింది. ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి జాషువా విచారణకు సీఎస్ అనుమతి లభించింది.
Also Read: ప్రమాదంలో వైయస్సార్ కాంగ్రెస్.. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అదే!
* అనుమతి తప్పనిసరి
సాధారణంగా మంత్రి( minister) స్థాయి నేతల అరెస్టు సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అందుకే ఇప్పుడు రజినీ విషయంలో ఏసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్కు లేఖ రాసింది. మంత్రిగా ఉన్న సమయంలో రజిని, ఐపీఎస్ అధికారి జాషువాతో కలిసి తమను బెదిరించారంటూ స్టోన్ క్రషర్ యజమానులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈ ఇద్దరి విచారణకు ఏసీబీ పట్టుదలతో ఉంది. అందుకే జాషువా పై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సి ఎస్ అనుమతి తీసుకుంది. మరోవైపు విడదల రజిని విచారణకు అనుమతించాలని కోరుతూ ఏపీ గవర్నర్ కు లేఖ రాసింది.
* ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ అనుమతి
అయితే తాజాగా గవర్నర్ కు ( governor)రాసిన లేఖపై ఒకటి రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆమోదం రాగానే వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆరోపణలపై ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. సంబంధిత స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వీరిద్దరూ ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని.. అప్పటి మంత్రి విడదల రజినీకి రెండు కోట్లు, ఐపీఎస్ అధికారి జాషువాకు 10 లక్షలు, రజిని పీఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది.
* పక్కా ఆధారాలతో ఏసీబీ..
అయితే విడదల రజిని( Vidadala Rajini ) విషయంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు రజిని జనసేనలో చేరుతారని కూడా ప్రచారం నడిచింది. కాగా ఇటీవలే హైకోర్టులో రజనీకి ఊరట దక్కింది. తనను అరెస్టు చేస్తారేమోనని ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రజనీతో పాటు పీఏ పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే తాజాగా గవర్నర్కు లేఖ రాయడం మాత్రం సంచలనం రేపుతోంది. పక్కా ఆధారాలతోనే ఏసీబీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
Also Read : 5 ఎమ్మెల్సీ స్థానాలు క్లీన్ స్వీప్.. జగన్ నియోజకవర్గంలో కూడా.. ఇదీ ‘కూటమి’ దండయాత్ర
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Vidadala rajini there is a rumor that vidadala rajini will be arrested after the governors permission
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com