YSR Congress Party : ఏ రాజకీయ పార్టీ( political party) కైనా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ అవసరం. క్యాడర్ బాగుంటేనే పార్టీ నిలబడుతుంది. క్యాడర్ ఉంటేనే నాయకత్వం నిలబడగలుగుతుంది. కానీ ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నా.. గ్రామస్థాయిలో కేడర్ మాత్రం చేతులెత్తేసింది. గత ఐదేళ్లలో తాము ఏమి సంపాదించుకోలేకపోయామని.. కనీసం పెండింగ్ బిల్లులైన తమకు దక్కాలంటే సైలెంట్ కావాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. మరికొందరు కేసుల భయంతో వెనక్కి తగ్గుతున్నారు. దీంతో గ్రామస్థాయిలో వైసీపీ బలం తగ్గుతోంది.
Also Read : జగన్ షాక్ అదుర్స్.. తేరుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు.. నిరాశలో టిడిపి కూటమి!
* ఆకర్షితులైన యువత
2019 ఎన్నికల కు ముందు జగన్( Jagan Mohan Reddy) సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో యువత ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో యువనాయకత్వం పుట్టుకొచ్చింది. ఎక్కడికక్కడే స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంత యువత ఎక్కువగా పదవులు పొందారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ వంటి పదవులను యువత అధికంగా దక్కించుకున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వారంతా టార్గెట్ అయ్యారు. గత ఐదేళ్లుగా వీరిపై జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా చేయూత కల్పించే ఏ పని చేయలేదు. మీరు చేసిన అభివృద్ధి పనులకు సైతం బిల్లులు చెల్లించలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది. అందుకే ఎక్కువమంది పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు.
* ముందే మేల్కొన్న చంద్రబాబు..
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) దారుణ పరాజయం ఎదురైంది. కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. పార్టీ పరిస్థితి దీనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. భయంతో పార్టీ శ్రేణులు ఇండ్లకే పరిమితం అయినా.. వారిలో ధైర్యం నింపి పోరాట బాట పట్టించేలా చేశారు. ప్రజల్లోకి వచ్చి క్షేత్రస్థాయి పర్యటనలు చేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టడం లేదు. ఇది ఆ పార్టీకి ముమ్మాటికి మైనస్.
* ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు
మరో ఏడాదిలో స్థానిక సంస్థల( local bodies) ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే స్థానిక సంస్థలన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జారుతున్నాయి. తప్పకుండా ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. గ్రౌండ్ లెవెల్ లో బలం పోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంచుకోవడం చాలా కష్టం. అది జరగాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టాలి. జనాల్లోకి రావాలి. అప్పుడే జనాల్లో కొంతవరకు ఆలోచన ప్రారంభమవుతుంది. ముందు జనం కంటే క్యాడర్.. ఎలా ముందడుగు వేయగలదో చూడాలి.
Also Read : ఏపీ ప్రభుత్వానికే విద్యార్థులు, ఉద్యోగుల ఓట్లు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత లేనట్లేనా!