Homeఆంధ్రప్రదేశ్‌Vice President Election 2025: జాతీయస్థాయిలో జగన్ ఎటువైపు?

Vice President Election 2025: జాతీయస్థాయిలో జగన్ ఎటువైపు?

Vice President Election 2025: కేంద్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి ( Indian vice president) రాజీనామా వ్యవహారం వెనుక రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. అయితే మరోసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండడంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతాయా? అన్న సందేహం కలుగుతోంది. ముఖ్యంగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతుందా? లేదా? అన్నది బిగ్ మిస్టరీ. ఎందుకంటే ఏపీలో ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. దీంతో టిడిపిని ప్రత్యర్థిగా భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ఒకవేళ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపితే జగన్ జాతీయ స్థాయిలో ఏకాకి కావడం ఖాయం. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు నిలిపిన అభ్యర్థికి మద్దతు తెలిపితే ఎన్డీఏ కన్నెర్ర చేయడం ఖాయం. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే కచ్చితంగా ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఆయనకు ఎదురయింది.

Also Read: ఏపీ క్యాబినెట్లో నారాయణ స్పెషల్.. రూ.50 కోట్లతో నిధి!

 రాజీనామాలతో ఉక్కిరి బిక్కిరి..
ప్రస్తుతం ఏపీలో భిన్న వాతావరణం నడుస్తోంది. వరుసగా నేతల అరెస్టులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బిజెపి భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేయిస్తోంది. ఇప్పుడు అదే కూటమి నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు తెలిపితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ విమర్శలు రావడం ఖాయం. కేవలం కేసులకు భయపడి ఎన్డీఏకు సాగిలాలు పడుతున్నారని కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డిని ఏకాకి చేయడం ఖాయం. అలాగని చంద్రబాబును కాదని బిజెపి జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేర్చుకోవడం కూడా అసాధ్యం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతారన్నది జాతీయస్థాయిలో కూడా ఒక చర్చకు కారణమవుతోంది.

 వైసిపికి 11 మంది సభ్యుల బలం..
లోక్సభ తో పాటు రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్ట్రోరల్ కాలేజ్( electoral college) ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. కచ్చితంగా జాతీయస్థాయిలో పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు కచ్చితంగా అభ్యర్థిని నిలబెడతాయి. ఎన్డీఏ భాగస్వామ్యంగా తెలుగుదేశం, జనసేన ఉన్నాయి. వీరికి 21 మంది ఎంపీలతో పాటు నలుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది. అంటే ఏపీలో ఎన్డీఏ సభ్యులు 25 మంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎంపీలు ఉన్నారు. అంటే వైసిపి బలం 11 అన్నమాట. కచ్చితంగా ఎన్డీఏకు వ్యతిరేకంగా నిలబడే అభ్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ మద్దతు కోరుతారు. అటువంటి సమయంలో మద్దతు ఇవ్వకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే. అలాగని మద్దతు ఇచ్చినా బిజెపికి శాశ్వత మిత్రుడు అయిపోవడం ఖాయం. జగన్ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టు ఉంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Also Read: టీడీపీలో వ్యతిరేకత.. వైసీపీలోకి ‘కొలికపూడి’.. ఇదే సాక్ష్యం?

స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు.
అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపికి మద్దతు తెలుపుతూ వచ్చింది. స్పీకర్( Loksabha speaker) ఎన్నికల సమయంలో కూడా కేంద్ర పెద్దలు వైసీపీ మద్దతు కోరలేదు. కానీ కోరకుండానే వైయస్సార్ కాంగ్రెస్ బే షరతుగా మద్దతు ప్రకటించడం విశేషం. అయితే ప్రస్తుతం ఎన్డీఏకు స్పష్టమైన బలం ఉంది. ఉపరాష్ట్రపతి పదవి గెలుచుకునే స్థాయిలో ఉంది. లోక్సభ తో పాటు రాజ్యసభతో కూడిన ఎలక్ట్రోరల్ కాలేజీలో 786 సభ్యులు ఉన్నారు. అందులో 394 మంది మద్దతు తెలిపితే చాలు. కానీ ఎన్డీఏకు 422 మంది సభ్యుల బలం ఉంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మద్దతు ఇస్తే.. జాతీయస్థాయిలో జగన్మోహన్ రెడ్డి ని పట్టించుకునే వారు ఉండరు. ఒకవేళ మద్దతు ఇవ్వకుంటే మాత్రం జాతీయస్థాయిలో ఇతర పార్టీల స్నేహం లభిస్తుంది. కానీ బిజెపి శాశ్వతంగా దూరమవుతుంది. ఇటువంటి సంక్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular