Hari Hara Veera Mallu Action Scenes: ఈమధ్య కాలం లో హీరోలు అందుబాటులో లేని సమయం లో అత్యధిక శాతం మేకర్స్ డూప్స్ తో కానిచ్చేస్తున్నారు. కానీ డూప్స్ తో చేసినప్పటికీ కూడా VFX తో సహజత్వానికి నూటికి నూరు శాతం మ్యాచ్ చేయడం వల్ల ఆడియన్స్ కి డూప్ ని వాడారు అనే సందేహం వచ్చేది కాదు. అందుకు బెస్ట్ ఉదాహరణ ‘కల్కి’. ఈ చిత్రం లో అత్యధిక శాతం షాట్స్ డూప్స్ తోనే కానిచ్చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడా ఆడియన్స్ కి ఇసుమంత కూడా డూప్ వాడినట్టు అనిపించలేదు. కానీ ఈరోజు విడుదలైన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం లో మాత్రం అనేక ఫైట్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) డూప్ ని వాడారని సినిమాని చూస్తున్న చిన్న పిల్లలు కూడా కనిపెట్టేయగలరు. అంత దారుణంగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. అనుభవం లేమి స్పష్టంగా కనిపించింది.
Also Read: ఆ విషయంలో ‘హరి హర వీరమల్లు’ కంటే ‘కన్నప్ప’ వెయ్యి రెట్లు బెటర్!
సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ కొత్తగానే డిజైన్ చేశారు కానీ, నటన పరంగా పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు. ఎందుకంటే ఆ పాత్రలో అంత స్కోప్ ఇవ్వలేదు డైరెక్టర్. డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువే, కానీ మంచి ప్రభావం చూపేవే. కానీ చార్మినార్ ఫైట్ లో కానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో కానీ ప్రతీ షాట్ లోనూ డూప్ ని వాడినట్టుగా అనిపించింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉంటూ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇలా చేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి, అవే ఈ సినిమాని కాపాడాలి. వీకెండ్ వరకు ఆడితే నిర్మాత AM రత్నం కొంతమేరకు సేఫ్ అవుతాడు. లేకపోతే దారుణమైన పరిస్థితి ని ఎదురుకోవాల్సి ఉంటుంది.
Also Read: హరిహర వీరమల్లు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
కేవలం పవన్ కళ్యాణ్ విషయం లోనే కాదు, ఇతర నటీనటుల విషయం లో కూడా డూప్స్ ని భారీ గా ఉపయోగించారు మేకర్స్. అందులో బాబీ డియోల్ కూడా ఉన్నాడు. చాలా సన్నివేశాల్లో ఆయనకు కూడా డూప్ వాడినట్టు స్పష్టంగా జనాలకు అర్థం అయిపోతుంది. VFX ఇన్నేళ్లు వీళ్లంతా ఏమి చేశారో అసలు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.