https://oktelugu.com/

Mahanadu Vs YCP Leaders : మరీ సిల్లీగా.. మహానాడుపై వైసీపీ నేతల అక్కసు బయటపడింది

టీడీపీ విధానాపరమైన నిర్ణయాలు, సైద్ధాంతిక విభేదాలపై వైసీపీ మాట్లాడితే బాగుంటుంది. కానీ  వైసీపీ నేతల రాజకీయమే వేరు. వారు ఫ్లెక్సీల్లో బాలకృష్ణకు ఫోటో లేదని,  సీనియర్ ఎన్టీఆర్ సస్పెన్షన్ ఎత్తి వేయాలని  సిల్లీ రీజన్స్ ను తెరపైకి తెస్తున్నారు

Written By:
  • Dharma
  • , Updated On : May 28, 2023 / 02:54 PM IST
    Follow us on

    Mahanadu Vs YCP Leaders : ఏపీలో వైసీపీ నేతలది విచిత్ర పరిస్థితి. మొన్నటికి మొన్న విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడులకు హాజరైన రజనీకాంత్ ను టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబు ను పొగిడిన పాపానికి కోట్లాది మంది అభిమానులున్న సూపర్ స్టార్ అని కూడా చూడలేదు. చెడామడా తిట్టేశారు. ఆయన ముఖం, శరీర ఆకృతులపై కూడా కామెంట్స్ చేశారు. చివరకు ఆయన అనారోగ్యాన్ని సైతం విడిచిపెట్టలేదు. దీంతో వీరితో ఎందుకొచ్చింది గొడవ అంటూ పాపం తమిళ సూపర్ స్టార్ స్పందించలేదు. బహుశా అందుకే కాబోలు హైదరాబాద్ వేడుకల్లో ఎవరూ పెద్దగా రాజకీయాలపై స్పందించలేదు. అయితే ఇప్పుడు రాజమండ్రి వేదిక టీడీపీ జరుపుకుంటున్న మహానాడుపై అదే స్థాయిలో వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు.

    టీడీపీ విధానాపరమైన నిర్ణయాలు, సైద్ధాంతిక విభేదాలపై వైసీపీ మాట్లాడితే బాగుంటుంది. కానీ  వైసీపీ నేతల రాజకీయమే వేరు. వారు ఫ్లెక్సీల్లో బాలకృష్ణకు ఫోటో లేదని,  సీనియర్ ఎన్టీఆర్ సస్పెన్షన్ ఎత్తి వేయాలని  సిల్లీ రీజన్స్ ను తెరపైకి తెస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ అంతర్గత కార్యక్రమం గురించి తమకు తోచిన రీతిలో మాట్లాడుతున్నారు. టీడీపీ శ్రేణులు వేయాల్సిన ప్రశ్నలు, చేయాల్సిన పోస్టుమార్టం వారే చేస్తున్నారు. టీడీపీ అభిమానులుగా మారిపోతున్నారు.

    టీడీపీ మహానాడుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతినిధుల సమావేశంతో పాటు పార్టీ స్థితిగతులపై చర్చిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే నాయకత్వానికి వేదికగా నిలుస్తుంది మహానాడు. ఎంతో మంతి ఇదే సభలో మాట్లాడి, తమ అభిప్రాయాలను చెప్పి నాయకులుగా ఎదిగిన వారు ఉన్నారు. అంతెందుకు ప్రస్తుత కేబినెట్ మంత్రి విడదల రజనీ సైతం ఇదే వేదికగానే నాయకురాలిగా పుట్టుకొచ్చారు. నేను మీరు నాటిన సైబరాబాద్ మొక్కనంటూ ఆమె చంద్రబాబుకి చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినబడుతునే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏకంగా మహానాడునే తప్పుపడుతూ వైసీపీ నేతలు మాట్లాడుతుండడం వెగటు పుట్టిస్తోంది.

    ఒక్కసారి వైసీపీ ప్లీనరీని గుర్తుకు తెచ్చుకుందాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడళ్లకు ప్లీనరీ నిర్వహించారు. అది కూడా గత ఏడాది ఒంగోలులో టీడీపీ మహానాడు సక్సెస్ అయ్యేసరికి పోటీగా ప్లీనరీ పెట్టారు. అయితే అందులో జగన్ భజనతో పాటు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరో మాటలు వినిపించలేదు. అసలు వైసీపీలో ప్లీనరీ అంటే.. ఏమీ ఉండదు.. చంద్రబాబును తిట్టడం. ఏ రేంజ్ లో తిట్టాలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా స్టేజి మీద కూర్చుని ఉమ్మారెడ్డి వంటి వారితో ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అయితే టీడీపీ ప్లీనరీలో ఉండేది వేరు. ఇక్కడ అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. అందుకే తమకు వచ్చిన అపవాదును మహానాడుకు అంటగట్టాలని ప్రయత్నిస్తున్నట్టుంది వైసీపీ నేతల నిర్వాకం.