Vanga Geetha: జనసేనలోకి వంగా గీత.. నిజమెంత?

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు పెరిగాయి. పై స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు చాలామంది నేతలు పార్టీ మారారు. ఒకవేళ వైసిపి అధికారంలోకి రాకపోతే ఉన్నవారు సైతం పార్టీ మారడం ఖాయం.

Written By: Dharma, Updated On : May 20, 2024 12:08 pm

Vanga Geetha

Follow us on

Vanga Geetha: వంగా గీత జనసేనలో చేరుతున్నారా? లెక్కింపునకు ముందే జంప్ తప్పదా? ఆ వార్తలో నిజం ఎంత? ఆ పరిస్థితుల్లో ఆమె ఉన్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పై వంగా గీత పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రారంభంలోనే వంగా గీత పై తన అభిప్రాయాన్ని చెప్పారు పవన్. ఆమె మంచి నాయకురాలని అభినందించారు కూడా. ప్రజారాజ్యం పార్టీతోనే ఆమె రాజకీయ జీవితం ప్రారంభించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఆమె జనసేనలో చేరతారని కూడా ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు దాని పైనే పెద్ద దుమారం రేగుతోంది. పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా అని విశ్లేషణలు ఉన్నాయి. మెజారిటీయే లెక్క అని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వంగా గీత పార్టీ మారతారు అన్న ప్రచారం ఊపందుకోవడం విశేషం.

ఈ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు పెరిగాయి. పై స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు చాలామంది నేతలు పార్టీ మారారు. ఒకవేళ వైసిపి అధికారంలోకి రాకపోతే ఉన్నవారు సైతం పార్టీ మారడం ఖాయం. కానీ జగన్ మాత్రం ధీమాతో ఉన్నారు. 150 కి పైగా సీట్లు గెలుపు పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పైగా కూటమి నేతలు సైతం ధీమాతో ఉన్నారు. 120 కి పైగా సీట్లను గెలుపు పొందుతామని భావిస్తున్నారు. నారా లోకేష్ లాంటి వారైతే తాము 160 సీట్లకు పైగా గెలుచుకుంటామని గంటాపదంగా చెబుతున్నారు. ఇటువంటి సమయంలో చాలామంది వైసిపి నేతలు భయపడుతుండడం మాత్రం వాస్తవం. అందులో భాగంగానే చాలామంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. వంగా గీత విషయంలో ఇలాంటి టాక్ నడుస్తోంది.

ఈ ఎన్నికల్లో బోటా బోటి మెజారిటీ వచ్చినా.. మిగతా పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలన్నది వైసీపీ ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైసీపీ ఖాళీ అవ్వక మానదు. అందులో భాగంగానే వైసీపీకి చెందిన చాలామంది అభ్యర్థులు ముందుగానే తమకు టచ్లోకి వచ్చారని టిడిపి నేతలు ప్రచారం మొదలుపెట్టారు. వంగా గీత విషయంలో పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆమె చర్యలు ఒకేలా ఉన్నాయి. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన గీత చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అటు పవన్ పై తాను విమర్శలు చేయలేదని, మున్ముందు చేయనని కూడా అని చెప్పుకొచ్చారు. దీంతో అనుమానాలు బలపడడానికి కారణమయ్యారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాకినాడ ఎంపీగా ఉన్న ఆమెను అయిష్టంగానే పిఠాపురం నుంచి పోటీ చేయించారని ప్రచారం జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం తో పాటు కీలక పోర్టు పోలియో కేటాయిస్తామని ఒప్పించారని సమాచారం. అయితే పూర్వాశ్రమంలో ప్రజారాజ్యం పార్టీతో.. చిరంజీవి కుటుంబంతో గీతకు అనుబంధం ఉంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమె జనసేనలో చేరడం ఖాయమని పిఠాపురంలో ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.