https://oktelugu.com/

ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉండొచ్చా? ఏమవుతుంది?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక వ్యక్తికి ఇన్ని మాత్రమే బ్యాంకు అకౌంట్స్ ఉండాలని నిబంధన పెట్టలేదు. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ అయినా తీసుకోవచ్చుు. అయితే ఓపెన్ చేసే అకౌంట్ ఎలాంటిదో ముందే తెలుసుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 20, 2024 12:12 pm
    Follow us on

    నేటి కాలంలో రైతుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. ఏ నగదు వ్యవహారమైనా బ్యాంకు ద్వారా చెల్లిస్తారు. దీంతో ఒక వ్యక్తి ఏ విధంగా ట్రన్జాక్షన్ చేస్తున్నారో ఇటు బ్యాంకు, అటు ప్రభుత్వం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే నేటి కాలంలో ఒక్కో వ్యక్తి వద్ద ఒకటికి పైగా బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. వాటి మెయింటెనన్స్ విషయం పక్కనబెడితే ఇలా ఎన్ని బ్యాంకు అకౌంట్లు అయినా వినియోగించవచ్చా? ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉండాలి? అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనిపై ఆర్బీఐ ఏం చెబుతుందంటే?

    ప్రభుత్వం అందించే సంక్షేమ నిధులను అందుకోవడానికి రైతుల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికి బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. వ్యవసాయం చేసే రైతు పండించిన ధాన్యం డబ్బు రావాలన్నా బ్యాంకు అకౌంట్ అడుతున్నారు. అటు ఉద్యోగులు సాలరీ చేతికి ఇవ్వకుండా బ్యాంకు అకౌంట్ ద్వారానే ట్రాన్స్ ఫర్ చరేస్తున్నారు. అయితే ఉద్యోగులు సంస్థ మారినప్పుడల్లా కొత్త బ్యాంకు అకౌంట్ తీయాల్సి వస్తుంది. ఆ సంస్థకు అనుగుణంగా, ఆ సంస్థ జరిపే నగదు వ్యవహారాలకు అనుగుణంగా కొత్త బ్యాంకు అకౌంట్ తీయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి?

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక వ్యక్తికి ఇన్ని మాత్రమే బ్యాంకు అకౌంట్స్ ఉండాలని నిబంధన పెట్టలేదు. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ అయినా తీసుకోవచ్చుు. అయితే ఓపెన్ చేసే అకౌంట్ ఎలాంటిదో ముందే తెలుసుకోవాలి. అంటే జీరో అకౌంట్ అయితే పర్వాలేదు. కానీ కొన్ని సేవింగ్ అకౌంట్లకు తప్పనిసరిగా మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. ఏటీఎం, చెక్ బుక్, ఇంటర్నెట్, క్రెడిట్ కార్డు వాడే వారు మాత్రం కచ్చితంగా బ్యాంకు విధించిన నిబంధనల ప్రకారం అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంచాలి.

    ఇక బ్యాంకు ద్వారా నగదు వ్యవహారాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ఫేక్ మెసేజ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును దోచుకునే వారు ఎక్కువవుతున్నారు. తాజాగా ఎస్బీఐ బ్యాంకు నుంచి రివార్డు ప్రకటిస్తున్నట్లు మెసేజ్ లు వస్తున్నాయని, వాటికి స్పందించాల్సిన అవసరం లేదని ఆ బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్ ను మొబైల్ లో లింక్ చేసుకున్నప్పుడు మొబైల్ కు లాకర్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.