Vamsi Gannavaram PS: వల్లభనేని వంశీ మోహన్ కు( Vamsi Mohan ) పోలీస్ కష్టాలు తప్పడం లేదు. ఇటీవలే ఆయనకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. దాదాపు 135 రోజులు పాటు ఆయన జైల్లో ఉండి పోయారు. దాదాపు 11 కేసులు ఆయనపై నమోదయ్యాయి. చివరిగా అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే అది షరతులతో కూడిన బెయిల్. ప్రతి నెల రెండో శనివారం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. నిన్ననే ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విచారణకు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ మోహన్ దూకుడుగా వ్యవహరించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అప్పట్లో గన్నవరం టిడిపి కార్యాలయం పై కూడా దాడి జరిగింది. ఆ దాడికి సూత్రధారి వల్లభనేని వంశీ మోహన్ అని టిడిపి శ్రేణులు అనుమానిస్తూ కేసులు పెట్టాయి. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై చర్యలకు పోలీసులు వెనుకడుగు వేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఫిబ్రవరి 17న హైదరాబాదులో వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 11 కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆయనకు బెయిల్ కూడా లభించలేదు. పలుమార్లు జైల్లో ఉన్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు. అయితే చివరిగా అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి జూలై 2న ఆయనకు బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. కానీ ప్రతి నెలా రెండో శనివారం పోలీస్ స్టేషన్ లో జరిగే విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
తీవ్ర జ్వరంతో పోలీస్ స్టేషన్ కు..
వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత.. నిన్ననే రెండో శనివారం ( second Saturday )కావడంతో ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆ సమయంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అంతకు ముందు శ్వాస సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు వంశీ మోహన్. అయితే తీవ్ర అస్వస్థతతో ఆయనకు గుండె రుగ్మత వచ్చిందని భావించారు. వైద్య పరీక్షలు కూడా చేశారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర జ్వరం వచ్చింది. కానీ కోర్టు ఆదేశాల మేరకు ఆయన విచారణకు గన్నవరం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తీవ్ర అస్వస్థతతో నీరసగా కనిపించారు. ఇక్కడ నుంచి ప్రతి నెల రెండో శనివారం కష్టాలు తప్పేలా లేవు ఆయనకు..!
మూడు గంటల నిరీక్షణ తరువాత ఈరోజు విచారణ లేదని చెప్పిన పోలీసులు
విచారణ ఎప్పుడు అనేది లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పిన వెల్లడి
గన్నవరం పీఎస్లో 3 గంటల పాటు వెయిట్ చేసిన మాజీ ఎమ్మెల్యే వంశీ.. మూడు గంటల తరువాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ హాస్పిటల్ కు బయల్దేరిన… https://t.co/t5GYBpIaeN pic.twitter.com/GkabbeForL
— Telugu Feed (@Telugufeedsite) July 12, 2025