One Student School: ప్రభుత్వ విద్యను( Government education) బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా సంస్కరణలను తీసుకొచ్చి పాఠశాలల స్వరూపాన్ని మార్చే ప్రయత్నంలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. వైసిపి ప్రభుత్వం పాఠశాలలో సర్దుబాటు పేరిట చేసే ప్రయత్నంలో భాగంగా చాలా స్కూళ్లు మూతపడ్డాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో విధిగా పాఠశాలలు ఉండాల్సిందేనని చెప్పి.. వాటిని తిరిగి తెరిచే ప్రయత్నం చేసింది. కానీ చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకే పాఠశాలలో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉండడం విశేషం.
ఆ రెండు పాఠశాలల్లో అదే తీరు..
బాపట్ల జిల్లా( Bapatla district) ఎర్రం వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది ఒకే ఒక్క విద్యార్థి చేరాడు. అక్కడ ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తుండగా.. ఒక్క విద్యార్థికి విద్యా బోధన చేస్తుండడం విశేషం. అటువంటి పరిస్థితి విజయనగరం జిల్లాలో కూడా కనిపిస్తోంది. భక్తి రాజేరు మండలం చిన్న వంగర లోని ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి ఉన్నారు. లెన్సి అనే బాలికకు ఉపాధ్యాయుడు సత్యమూర్తి పాఠాలు బోధిస్తున్నారు. గత ఏడాది లెన్సి ఒకటో తరగతిలో చేరింది. ప్రస్తుతం రెండో తరగతికి చేరుకుంది. కానీ పాఠశాలలో విద్యార్థులు చేరలేదు. దీంతో ఆ ఒక్క బాలికకు మాత్రమే ఆ ఏకోపాధ్యాయుడు బోధిస్తున్నారు.
Also Read: Vamsi Gannavaram PS: వల్లభనేని వంశీకి ‘రెండో శనివారం’ తిప్పలు!
ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎన్నో..
అయితే ఈ రెండు పాఠశాలల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా.. చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి. అయితే ఎక్కువగా ఏకోపాధ్యాయ( single teacher) పాఠశాలలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు వంటి వాటితో చాలా రకాల పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పుడు వాటిని తెరిపించింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం తో పాటు అన్ని రకాల వసతులు కల్పించింది. కానీ ఎందుకో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. దీంతో అక్కడ ఇబ్బందులు తప్పడం లేదు.