Vallabhaneni Vamsi : గన్నవరం వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ఈ ఏడాది ఫిబ్రవరి 13 వ తారీఖున అరెస్ట్ అయిన సంఘటన పెద్ద దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఆయన తనయుడు లోకేష్(Nara Lokesh) లపై గతంలో వంశీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసాడో రెండు రాష్ట్రాల్లోని ప్రతీ ఒక్కరు చూసారు. అంతే కాకుండా టీడీపీ పార్టీ కార్యాలయం పై తన అనుచరులతో కలిసి దాడి చేయించిన కేసులు కూడా ఆయనపై నమోదు అయ్యాయి. ఇక ఈ కేసు లో ప్రత్యక్ష సాక్షి అయిన సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి కేసు ని వెనక్కి తీసుకోమని బెదిరించాడంటూ సత్యవర్ధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, వంశీ ని వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ కేసు తో పాటుగా, టీడీపీ కార్యాలయం దాడి చేసిన కేసు, మరియు ఇతర కేసులు కూడా ఆయనపై నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Also Read : మే 13 మాదంటే మాది.. టిడిపి వర్సెస్ వైసిపి.. సోషల్ మీడియా షేక్!
వల్లభనేని వంశీ ని చూసేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చిన మాజీ సీఎం జగన్, అన్యాయం గా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, రేపు మా అధికారం వస్తుంది, న్యాయాన్ని అతిక్రమించిన ప్రతీ పోలీస్ అధికారిని బట్టలు ఊడదీసి కూర్చోబెడుతాము అంటూ పోలీస్ స్టేషన్ బయట చేసిన సంచలన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సంఘటన జరిగి దాదాపుగా మూడు నెలలు అయ్యింది. అసలు వమ్మభనేని వంశీ బయటకి ఇప్పట్లో వస్తాడా?, సత్యవర్ధన్ కేసు లో బెయిల్ దొరకడం అసాధ్యం అని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆయనకు నేడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు లో బెయిల్ మంజూరు అయ్యింది. ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తూ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వంశీ తో పాటు ఈ కేసు లో అరెస్ట్ అయిన మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరు అయ్యింది. వారిలో ఇద్దరికీ 50 వేల చొప్పున పూచీకత్తులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కిడ్నాప్ కేసు లో బెయిల్ వచ్చేసింది కానీ, టీడీపీ కార్యాలయం పై చేసిన దాడి కేసులో మాత్రం ఇంకా బెయిల్ రాకపోవడం తో వంశీ ఇంకా కొన్నాళ్ళు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఉన్నది. అప్పుడప్పుడు కస్టడీ విచారణకు బయటకు వచ్చినప్పుడు వంశీ మాసి గెడ్డం, జుట్టుతో గుర్తు పట్టలేని విధంగా కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే ఇక్కడ అర్థం కానీ విషయం ఏమిటంటే, చాలా సులువుగా బెయిల్ దొరుకుంటుంది అనుకున్న టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో బెయిల్ రాలేదు కానీ, అసాధ్యం అనుకున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఎలా వచ్చింది?, ఇందులో ఏదైనా మతలబు ఉందా అంటూ సోషల్ మీడియా లో కూటమి నేతలు సందేహిస్తున్నారు.
Also Read : చంద్రబాబు హెలిక్యాప్టర్ ఫిట్నెస్ పై అనుమానాలు.. అధ్యయనానికి కమిటీ!