CM Chandrababu Helicopter: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) భద్రతపై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పాకిస్తాన్ తో భారత్ యుద్ధం నేపథ్యంలో చంద్రబాబు జిల్లా పర్యటనలకు సంబంధించి భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర డిజిపి అన్ని జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో పాటు పలువురు వీఐపీలు వాడుతున్న హెలిక్యాప్టర్ ఫిట్నెస్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హెలిక్యాప్టర్ వాడకం అంత సురక్షితం కాదన్న చర్చ నడుస్తోంది. దీంతో ప్రభుత్వం ఈరోజు సీఎంతో సహా విఐపి లు వాడుతున్న హెలిక్యాప్టర్ సామర్థ్యం పై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో దీనిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అయితే కేంద్రం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: ప్రధాని మోదీ IAF సందర్శన.. ఆపరేషన్ సిందూర్ వీరులకు అభినందన
* చాలా రకాల అనుమానాలు..
ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో పాటు వీఐపీల రాకపోకల కోసం ఓ హెలికాప్టర్( helicopter) ఉంది. దీన్ని సామర్థ్యం పై చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. పిల్లి తరుణంలోనే హెలికాప్టర్ సామర్థ్యం పై అధ్యయనం కోసం సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ప్రభుత్వం ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నలుగురు సభ్యులను సైతం నియమించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న హెలిక్యాప్టర్ సామర్థ్యం ఎలా ఉంది? ఒకవేళ మారిస్తే ఎలాంటి హెలికాప్టర్ ఉండాలని అంశంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఉన్నపలంగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం చర్చకు దారితీస్తోంది.
* కమిటీలో అధికారులు వీరే..
సీఎం వినియోగించే హెలికాప్టర్ ఫిట్నెస్ అధ్యయన కమిటీలో( special committee ) సభ్యులుగా… ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇంటలిజెన్స్ ఎ డీజీ, పౌర విమానయాన సేకరించి ఒక ప్రతినిధి ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. రెండు నెలల్లో ఈ కమిటీ సీఎం హెలిక్యాప్టర్ ఫిట్నెస్ పై నివేదిక ఇవ్వనుంది. దీంతో ఈ కమిటీ త్వరలో దీనిపై అధ్యయనం చేపట్టబోతోంది. గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిన నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెలిక్యాప్టర్ల ఫిట్నెస్ పై దృష్టి పెడుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం సైతం అధ్యయన కమిటీని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు భద్రతకు పెద్దపీట వేస్తున్న తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.