Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ని కాసేపటి క్రితమే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్వాసకు సంబంధించి తీవ్రమైన ఇబ్బంది రావడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన క్లారిటీ లేదు. మరోపక్క ఈ వార్త తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణుల్లో, వల్లభనేని వంశీ అనుచరుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. మా అభిమాన నాయకుడుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రార్థనలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇకపోతే ఫిబ్రవరి 13 వ తారీఖున వంశీ ని పోలీసులు గతంలో టీడీపీ పార్టీ కార్యాలయం పై దాడి చేయించిన కేసులో, అదే విధంగా ఆ కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి కేసుని వెనక్కి తీసుకునేలా చేసినందుకు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read : పాపం కొడాలి నాని.. సొంతవారు సైతం!
హైదరాబాద్ లోని ఒక అపార్ట్మెంట్స్ లో రహస్యంగా ఉంటున్న వల్లభనేని వంశీ ని గుర్తించి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఈ రెండు కేసుల్లో సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ టీడీపీ కార్యాలయం పై దాడి చేసిన కేసులో మాత్రం బెయిల్ లభించలేదు. దీంతో వంశీ జైలులోనే ఉంటున్నాడు. ఈ కేసులో కూడా బెయిల్ లభిస్తుంది అని కార్యకర్తలు అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. వంశీ ఆరోగ్య బాధ్యత పూర్తిగా కూటమి ప్రభుత్వానిదే, ఆయన పై ఈగ వాలినా మేము ఊరుకోము అంటూ బెదిరిస్తున్నారు. ఇకపోతే వంశీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కాసేపట్లో హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది.
పరిటాల రవి అనుచరుడిగా వల్లభనేని వంశీ కి అప్పట్లో ఎంత పేరు ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయనకు కొడాలి నాని కూడా ప్రాణ స్నేహితుడు. ఒకప్పుడు వీళ్లిద్దరు తెలుగు దేశం పార్టీ లోనే ఉండేవారు. కానీ కొడాలి నాని 2014 ఎన్నికల తర్వాత వైసీపీ లో చేరిపోయాడు. ఇక వల్లభనేని వంశీ 2019 వరకు తెలుగు దేశం పార్టీ లోనే కొనసాగాడు. 2019 లో ఆయన సైకిల్ గుర్తు మీదనే పోటీ చేసాడు. అయితే నారా లోకేష్ తనపై కుట్రలు చేస్తున్నాడని. తన మీడియా చేత నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని వల్లభనేని వంశీ ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటకు వచ్చేసాడు. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసి ఘోరమైన పరాజయాన్ని ఎదురుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలం రాజకీయ కార్యక్రమాలకు దూరంగా హైదరాబాద్ లో రహస్యం గా తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : ఈ గల్ఫ్ దేశాల విలాసం ముందు అమెరికా వేేస్ట్ అట.. నివ్వెరపోయిన ట్రంప్