Andhra King Taluka: గత కొంతకాలం నుండి హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కి సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన గత చిత్రం ‘డబుల్ ఇష్మార్ట్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో తప్పటడుగులు వేస్తున్నానని గమనించిన రామ్, ఇక మీదట కంటెంట్ సినిమాలను మాత్రమే చేయాలనీ నిర్ణయించుకొని మాస్ సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చాడు. అందులో భాగంగా ఆయన ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రం లో నటించడానికి ఒప్పుకున్నాడు. ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న పీ. మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే(Bhagyashree Borse) ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేసారు మేకర్స్. ఈ గ్లింప్స్ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
Also Read: చిరంజీవి కోసం 20 ఏళ్ళ ప్రామిస్ ని పక్కన పెట్టిన నయనతార..!
ఇన్ని రోజులు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అంటే రామ్ ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానిగా కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా కానీ నటిస్తున్నాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర వీరాభిమాని గా నటిస్తున్నాడని రీసెంట్ గానే తెలిసింది. ఇందులో ఉపేంద్ర సూర్య కుమార్ అనే ఇండియన్ సూపర్ స్టార్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. సూర్య కుమార్ అభిమాని గా రామ్ కనిపించనున్నాడు. ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ లో కౌంటర్ దగ్గర టికెట్స్ అమ్మే వ్యక్తి ‘ఎమ్మెల్యే తాలూకా’, ‘కొర్పొరేటర్ తాలూకా’ మరియు ఇతర ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళ తాలూకా అంటూ ఫోన్ కాల్స్ చేసి చెప్తుంటే, వాళ్ళ కోసం టికెట్స్ తీసి పెడుతూ ఉంటాడు. కొంతమందికి లేవని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. అప్పుడు హీరో రామ్ సైకిల్ మీద వస్తాడు.
స్టైల్ గా నడుచుకుంటూ టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి 50 టిక్కెట్లు కావాలి, మేము ఫ్యాన్స్ అని అంటాడు. కౌంటర్ లో కూర్చున్న వ్యక్తి మారు మాట్లాడకుండా అడిగినన్ని టికెట్స్ ఇస్తాడు. అభిమానులు అడిగితే ఎన్ని టికెట్స్ అయినా ఇవ్వాల్సిందే అనే అర్థం వచ్చేలాగా ఈ గ్లింప్స్ వీడియో ఉంటుంది. ఇది ఒక వీరాభిమాని ఆత్మకథ గా డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తన అభిమాన హీరోకి కష్టమొస్తే ఎంత దూరమైనా వెళ్లి, ప్రాణాలను పణంగా పెట్టి కాపాడే క్యారక్టర్ లో రామ్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా సూర్య కుమార్ క్యారక్టర్ కోసం మోహన్ లాల్ ని సంప్రదించారు. ఆ తర్వాత మరికొంత మంది స్టార్ హీరోలను కూడా సంప్రదించారు. ఎందుకో ఎవ్వరూ ఒప్పుకోలేదు, చివరికి ఉపేంద్ర వద్దకు వెళ్లి ఈ కథని వినిపించిన వెంటనే ఆయన ఒప్పుకున్నాడు. ఈ క్యారక్టర్ మూవీ లో చాలా ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.