Bus Accident At Nandyal: తెలుగు రాష్ట్రాలను( Telugu States ) బస్సు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కర్నూలు జిల్లాలో కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదంలో 42 మంది సజీవ దహనం అయ్యారు. చేవెళ్ల సమీపంలో తెలంగాణ ఆర్టీసీని టిప్పర్ ఢీకొన్న ఘటనలో 18 మంది చనిపోయారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. 36 మంది క్షేమంగా బయటపడ్డారు.
హైదరాబాద్ వెళుతుండగా..
నెల్లూరు ( Nellore) నుంచి హైదరాబాద్కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బుధవారం రాత్రి బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో కర్నూలు – చిత్తూరు ప్రధాన రహదారిపై.. నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద బస్సు టైరు పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి అవతల వెళ్తున్న లారీని ఢీకొట్టింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అయితే ఆ సమయంలో అటుగా వస్తున్న డీసీఎంఎస్ వ్యాన్ డ్రైవర్ బస్సు అద్దాలు పగలు కట్టడంతో ప్రయాణికులు బయటకు గంతేసి ప్రాణాలు దక్కించుకున్నారు. బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం అయ్యారు.
ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఎక్కువగా..
ఇటీవల ప్రమాదానికి గురైన వాటిలో ప్రైవేటు ట్రావెల్ బస్సులు( private travel buses ) ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతి జిల్లాలో ట్రావెల్స్ బస్సులు పెరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాటిని తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్ లతో, అక్కడ ఫిట్నెస్ సర్టిఫికెట్లతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాల మధ్య ఈ ట్రావెల్ బస్సులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్రావెల్ బస్సులు అంటేనే అతి వేగంగా దూసుకొస్తుండడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఈ ట్రావెల్ బస్సులన్నీ అర్ధరాత్రి ప్రయాణాలు కొనసాగిస్తుంటాయి. ఆ సమయంలోనే ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా మంటల్లోనే ప్రయాణికులు చిక్కుకోవడం.. ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగిస్తోంది. వరుస ఘటనలు చూస్తుంటే ట్రావెల్ బస్సులు అంటేనే జనం భయపడిపోతున్నారు.
VIDEO | Nandyal, Andhra Pradesh: Two dead, 14 injured in bus-lorry collision; injured shifted to hospital.#AndhraNews #AndhraPradesh
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/AHXX8G8q3p
— Press Trust of India (@PTI_News) January 22, 2026