Social Media Ban in AP: ఏపీలో( Andhra Pradesh) సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని అనేక రకాల దుష్పరిణామాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ నిషేధం అనేది 16 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఇది అమల్లో ఉంది. మొన్న ఆ మధ్యన ఆస్ట్రేలియా వెళ్లారు మంత్రి నారా లోకేష్. అక్కడ విద్యాసంస్కరణల్లో భాగంగా చేపట్టిన పథకాలు గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే 16 సంవత్సరాలలోపు పిల్లలకు అక్కడ సోషల్ మీడియాలో నిషేధం విధించారు. పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే ఏపీలో సైతం దీనిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
చాలా విస్తృతం..
ఇటీవల ఆన్లైన్ విద్యాబోధన( online classes) తీరు పెరిగింది. ఎక్కువగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వాటి ద్వారానే పాఠాలు బోధిస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా విస్తృతం అవుతోంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అంత సోషల్ మీడియాలో తేలిపోతున్నారు. చివరకు అన్నం తినమని మారం చేసి చిన్నారుల చేతిలో సైతం సెల్ఫోన్ పెట్టాల్సి వస్తోంది. గతంలో టీవీల్లో వచ్చే రైమ్స్, సెల్ఫోన్ గేమ్ ల వరకు మాత్రమే పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియాలో వచ్చే అన్ని యాప్లను ఓపెన్ చేస్తున్నారు. పెద్దవారికి తెలియనివి కూడా చిన్నారులకు ఇట్టే తెలిసిపోతున్నాయి. సెల్ ఫీచర్లు వాడేది కూడా వారే ఎక్కువ. అయితే దానితో కొన్ని రకాల దుష్పరిణామాలు జరుగుతున్నాయి. అశ్లీలత, జూదమాటలు వైపు కొంతమంది మల్లుతున్నారు. చదువులకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి.
అమలు చేయడమే అసలు ప్రశ్న..
అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 16 సంవత్సరాలలోపు వారికి సోషల్ మీడియా నిషేధం నిర్ణయించడం మంచిదే. కానీ దీనిని ఎలా అమలు చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే వయస్సు నిర్ధారణతో పాటు.. సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడం అనేది అంత సులువు కాదు. ప్రజల్లో విస్తృతస్థాయి చర్చ జరిపి అమలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత సెల్ ఫోన్ నెట్వర్క్ లతో సైతం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పిల్లలకు సోషల్ మీడియాలో అవకాశం కల్పిస్తే వెంటనే చర్యలు ఎలా తీసుకోవాలి? ఏ శాఖ స్పందించాలి? అనే విషయాలపై లోతైన అధ్యయనం జరగాలి. అయితే 14 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధాన్ని మాత్రం ఎక్కువ మంది ఆహ్వానిస్తారు.. అయితే అమలు చేయడం అనేది ఒక సాహస ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం ఎలా దీనిని అమలు చేస్తుంది అనేది చూడాలి.